న్యూఢిల్లీ: పబ్లిక్ ఎగ్జామ్స్ సవరణ బిల్లును ఇవాళ లోక్సభ(Lok Sabha)లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మంత్రి జితేంద్ర సింగ్ ఆ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఆ బిల్లుపై చర్చ చేపట్టనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు లోక్సభ ప్రారంభమైన తర్వాత విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అయితే సభను వాయిదా వేస్తూ.. స్పీకర్ ఓం బిర్లా సాయంత్రం 5 గంటలకు పేపర్ లీకేజీ నిరోధక బిల్లుపై చర్చ చేపట్టనున్నట్లు వెల్లడించారు. పబ్లిక్ ఎగ్జామ్స్ సవరణ బిల్లు ప్రకారం పేపర్ లీకేజీ కేసులను రెండు నెలల్లోగా దర్యాప్తు చేపట్టాలి. పేపర్ లీకేజీకి పాల్పడిన వారికి కనీసం 5 నుంచి పదేళ్ల జైలుశిక్ష పడనున్నది. జరిమానా సుమారు 50 లక్షల వరకు విధించనున్నారు.
ఒకవేళ వ్యవస్థీకృత నేరం జరిగితే, అప్పుడు ఆ బిల్లు ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. సుమారు 10 కోట్ల ఫైన్ కూడా ఉంటుందని బిల్లులో ఉన్నది. పేపర్ లీకేజీ సవరణ బిల్లుపై చర్చను 6 గంటల వరకు పొడిగిస్తున్నట్లు స్పీకర్ బిర్లా తెలిపారు. విపక్షాలు నినాదాలు ఆపేయాలన్నారు. సుదీర్ఘంగానే ఈ అంశంపై చర్చిద్దామన్నారు.
#WATCH || Union Minister @DrJitendraSingh introduces the Public Examinations (Prevention of Unfair Means) Amendment Bill, 2026 in Lok Sabha.#MonsoonSession2026 #Parliamentsession #LokSabha https://t.co/UaAaeWayBc pic.twitter.com/p7emdsb3l2
— All India Radio News (@airnewsalerts) July 27, 2026
మరోవైపు ఇవాళ రాజ్యసభను 3 గంటల వరకు వాయిదా వేశారు. విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు. నిరసనకారులపై పోలీసులు కాల్పులు, లాఠీఛార్జ్ను ఖండించారు. ఆ ఘటనల పట్ల హోంశాఖ మంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని విపక్షాలు పట్టుపట్టాయి.
“The Public Examinations (Prevention of Unfair Means) (Amendment) Bill, 2026 पर चर्चा के लिए विपक्ष नारेबाज़ी क्यों कर रहा है, यह मेरी समझ से परे है। पूरे देश के युवाओं की नज़र इस विधेयक पर है।” — संसदीय कार्य मंत्री @KirenRijiju
भारी शोर-शराबे के बीच… pic.twitter.com/nCZNW4yLKU
— SansadTV (@sansad_tv) July 27, 2026