భువనేశ్వర్: ఒక పోలీస్‌ను మహిళా కానిస్టేబుల్ రహస్యంగా పెళ్లి చేసుకున్నది. అతడు ఆమె నుంచి పది లక్షలు అప్పు తీసుకున్నాడు. అధికారిక పెళ్లి వేడుక కోసం ఆ డబ్బు ఇవ్వాలని ఆ మహిళ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో భర్త అయిన పోలీస్ కానిస్టేబుల్ ఆమెను హత్య చేశాడు. (Woman Cop Murdered) ఒడిశాలో ఈ సంఘటన జరిగింది. జగత్సింగ్పూర్ జిల్లాలోని పారాదీప్‌కు చెందిన 25 ఏళ్ల శుభమిత్ర సాహూ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్. భువనేశ్వర్‌లో ఆమె విధులు నిర్వహిస్తున్నది. 2024 జూలైలో పోలీస్ కానిస్టేబుల్ దీపక్ రౌత్, ఆమె రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.
కాగా, భువనేశ్వర్‌లో తన తల్లితో కలిసి నివసిస్తున్న శుభమిత్ర, సెప్టెంబర్ 6న డ్యూటీ కోసం ఇంటి నుంచి వెళ్లింది. అయితే డ్యూటీ తర్వాత ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. శుభమిత్ర తల్లి ఆ మరునాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కియోంఝర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ శుభమిత్ర హత్యపై పోలీసులు దర్యాప్తు చేశారు. గత ఏడాది జూలైలో పోలీస్ కానిస్టేబుల్ దీపక్ రౌత్‌తో ఆమెకు రహస్యంగా పెళ్లి జరిగినట్లు తెలుసుకున్నారు. మిస్సింగ్ రోజున భర్త ఆమె వద్దకు వచ్చి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. దీంతో అతడిపై అనుమానించి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
కాగా, శుభమిత్రను తానే హత్య చేసినట్లు భర్త దీపక్ రౌత్ ఒప్పుకున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. ఆమె నుంచి అతడు పది లక్షలు అప్పుగా తీసుకున్నాడని చెప్పారు. తమ పెళ్లిని అధికారికంగా ప్రకటించే వేడుక కోసం ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసిందన్నారు.
మరోవైపు ఆ డబ్బు తిరిగి ఇవ్వడం ఇష్టంలేని భర్త దీపక్ ఆమెను బెదిరించాడని పోలీస్ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో శుభమిత్రను కారులో తీసుకెళ్లి గొంతునొక్కి హత్య చేసి మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పాతిపెట్టాడని చెప్పారు.
కాగా, ఎక్కడో దాక్కోవాలనుకుంటున్నట్లు పలు పుణ్యక్షేత్రాల నుంచి శుభమిత్ర చాటింగ్ మెసేజ్‌లు వచ్చాయని పోలీస్ అధికారి తెలిపారు. అందుకే తొలుత ఆమె భర్తను అనుమానించలేదని చెప్పారు. ఆమె హత్య కేసులో ఇతర వ్యక్తుల పాత్ర ఉన్నదా అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
US Woman Murder | పెళ్లి కోసం భారత్ వచ్చిన అమెరికా మహిళ.. హత్య చేసిన కాబోయే భర్త
Woman Throws daughter In Lake | ప్రియుడికి ఇష్టంలేదని.. మూడేళ్ల కుమార్తెను నీటిలో పడేసిన మహిళ
Landslides | ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు.. 20 మందికి గాయాలు, 14 మంది మిస్సింగ్
Watch: విరిగిపడిన కొండచరియలు.. తృటిలో తప్పించుకున్న బీజేపీ ఎంపీ