డెహ్రాడూన్: ప్రకృతి విలయంతో ఉత్తరాఖండ్ అల్లాడుతున్నది. చమోలి జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. (Landslides) దీంతో నాలుగు గ్రామాల్లో 30కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. 20 మంది గాయపడగా 14 మంది గల్లంతయ్యారు. శిథిలాల కింద వారు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. గురువారం భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. దీంతో చమోలి జిల్లాలోని నాలుగు గ్రామాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. 30కుపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో సుమారు 20 మంది గాయపడ్డారు. 14 మంది జాడ కనిపించడం లేదు. దీంతో అదృశ్యమైన వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.
కాగా, జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నాయని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. తలకు గాయమైన చిన్నారితో సహా తీవ్రంగా గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించినట్లు వివరించారు. ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు.
#WATCH | Uttarakhand | Six buildings were destroyed by debris due to a cloudburst and heavy rain in the Kuntri Lagafali ward of Nandanagar, Chamoli. The Chamoli district administration has intensified relief and rescue operations at the site. Panic gripped the area, fear gripped… pic.twitter.com/s8UC5k76dO
— ANI (@ANI) September 18, 2025
Also Read:
Watch: విరిగిపడిన కొండచరియలు.. తృటిలో తప్పించుకున్న బీజేపీ ఎంపీ
Woman Throws daughter In Lake | ప్రియుడికి ఇష్టంలేదని.. మూడేళ్ల కుమార్తెను నీటిలో పడేసిన మహిళ