చండీగఢ్: అమెరికా పౌరురాలైన మహిళ (US Woman Murder) ఎన్నారై వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు భారత్ వచ్చింది. అయితే వృద్ధుడైన కాబోయే భర్త ఆమెను హత్య చేయించాడు. చంపిన వ్యక్తి ఆ వృద్ధురాలి మృతదేహాన్ని తగులబెట్టాడు. ఆ మహిళ మిస్సింగ్‌పై దర్యాప్తు చేసిన పోలీసులు ఆమె హత్యకు గురైనట్లు తెలుసుకున్నారు. భారత సంతతికి చెందిన 71 ఏళ్ల రూపిందర్ కౌర్ పంధేర్ అమెరికా పౌరురాలు. బ్రిటన్ పౌరుడైన 75 ఏళ్ల ఎన్నారై చరణ్‌జిత్ సింగ్ గ్రెవాల్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పంజాబ్‌లోని లూధియానాలో నివసిస్తున్న అతడు, ఇండియాకు రావాలని ఆమెను ఆహ్వానించాడు.
కాగా, రూపిందర్ కౌర్ పంధేర్ అమెరికాలోని సియాటిల్ నుంచి పంజాబ్‌లోని లూధియానాకు జూలైలో చేరుకున్నది. ఆ తర్వాత ఆమె అదృశ్యమైంది. జూలై 24న మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో అమెరికాలోని సోదరి కమల్ కౌర్ ఖైరా అనుమానించింది. జూలై 28న ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ఆమె అలెర్ట్ చేయడంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు రూపిందర్ కౌర్ మిస్సింగ్‌పై లూధియానా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మల్హా పట్టికి చెందిన సుఖ్జీత్ సింగ్ సోను ఆమెను హత్య చేసినట్లు తెలుసుకున్నారు. అతడ్ని అరెస్ట్ చేసి ప్రశ్నించారు. అమెరికా మహిళను తన ఇంట్లో చంపి మృతదేహాన్ని స్టోర్‌రూమ్‌లో తగలబెట్టినట్లు పోలీసులకు చెప్పాడు. రూ.50 లక్షలు ఇస్తానని, రూపిందర్ కౌర్‌ను హత్య చేయాలని చరణ్‌జిత్ సింగ్ చెప్పడంతో ఈ పని చేసినట్లు వెల్లడించాడు.
కాగా, పరారీలో ఉన్న చరణ్‌జిత్ సింగ్ గ్రెవాల్‌ను హత్య కేసులో నిందితుడిగా చేర్చినట్లు పోలీస్ అధికారి తెలిపారు. పెళ్లి కోసం భారత్ రాకముందు భారీ డబ్బును రూపిందర్ కౌర్ అతడికి ట్రాన్స్ఫర్ చేసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్థికపరమైన కారణాల వల్ల చరణ్‌జిత్ సింగ్ ఆమెను హత్య చేయించాడని వివరించారు. అమెరికాలో ఉంటున్న ఆమె కుటుంబానికి హత్య సమాచారం ఇచ్చినట్లు పోలీస్ అధికారి తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు.
Also Read:
Landslides | ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు.. 20 మందికి గాయాలు, 14 మంది మిస్సింగ్
Watch: విరిగిపడిన కొండచరియలు.. తృటిలో తప్పించుకున్న బీజేపీ ఎంపీ
Woman Throws daughter In Lake | ప్రియుడికి ఇష్టంలేదని.. మూడేళ్ల కుమార్తెను నీటిలో పడేసిన మహిళ