లక్నో: షాపింగ్ మాల్ వద్ద కాల్పుల సంఘటన కలకలం రేపింది. (Shooting at Lucknow mall) కాల్పుల శబ్దం విని అక్కడున్న వారంతా భయాందోళన చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మహిళతో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. సుశాంత్ గోల్ఫ్ సిటీ ప్రాంతంలోని పలాసియో మాల్‌లోకి ప్రవేశించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా గేట్ వద్ద భద్రతా సిబ్బందితో వారు వాగ్వాదానికి దిగారు.
కాగా, ఈ ఘర్షణ నేపథ్యంలో ఒక వ్యక్తి తన లైసెన్స్ రివాల్వర్‌ను బయటకు తీశాడు. గాలిలోకి కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ గందరగోళం చెలరేగింది. కాల్పుల శబ్దం విని అక్కడున్న వారు భయాందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు పోలీసులు ఆ మాల్ వద్దకు చేరుకున్నారు. ముగ్గురు యువకులు, వారితో పాటు ఉన్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. లైసెన్స్ కలిగిన రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పుల సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
DK Shivakumar | ‘ప్రకృతి వల్లే గుంతలు’.. బెంగళూరు రోడ్లపై డీకే శివకుమార్
Woman Stabs Boyfriend | పెళ్లి విషయంపై గొడవ.. ప్రియుడ్ని కత్తితో పొడిచి చంపిన మహిళ
Watch: అర్ధరాత్రి వేళ ఆకాశంలో ప్రకాశవంతమైన కాంతులు.. వీడియో వైరల్