కాలుతున్న ట్రాన్స్ఫార్మర్లు
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని గాగిళ్లాపూర్‌లో కొన్ని రోజులుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు వరుసగా కాలిపోతుండడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. లోవోల్టేజీతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయంతో ట్రాన్స్ఫార్మర్లు మాటిమాటికి కాలిపోతున్నాయి. అక్రమ విద్యుత్ కనెక్షన్లతో సరిపడా సామర్థ్యం లేక ఇలా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. అక్రమ విద్యుత్ కనెక్షన్లను నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు.
- ఎండుతున్న పంటలు
- ఆందోళనలో కర్షకులు
- రైతులకు భారంగా మారుతున్న రిపేరు ఖర్చులు
మద్దూరు(ధూళిమిట్ట), మార్చి 10: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని గాగిళ్లాపూర్‌లో కొన్ని రోజులుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు వరుసగా కాలిపోతుండడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. లోవోల్టేజీతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయంతో ట్రాన్స్ఫార్మర్లు మాటిమాటికి కాలిపోతున్నాయి. అక్రమ విద్యుత్ కనెక్షన్లతో సరిపడా సామర్థ్యం లేక ఇలా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. అక్రమ విద్యుత్ కనెక్షన్లను నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు.
మరమ్మతుల కేంద్రం చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల్లను తీసుకెళ్లి ఉచితంగా మరమ్మతులు చేసి తిరిగి బిగించాల్సిన బాధ్యత విద్యుత్ శాఖపైనే ఉంటుంది. క్షేత్రస్థాయిలో మాత్రం ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కోసం రైతులు వేలాది రూపాయలు ఖర్చులు భరించాల్సి వస్తున్నది. ప్రధానంగా కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను ట్రాక్టర్ ద్వారా ముస్త్యాలలోని మరమ్మతుల కేంద్రానికి తీసుకెళ్లేందుకు రూ. 2వేలు, మరమ్మతుల కేంద్రం వద్ద రూ. 2 వేలు, ట్రాన్స్ఫార్మర్ బిగింపు కోసం మరో రూ.2 వేలు ఖర్చు అవుతున్నాయని రైతులు తెలిపారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి వరుసగా కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేపట్టడంతో పాటు ఖర్చుల నుంచి తమకు ఉపశమనం కలిగించాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

