శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. చైనా గ్రెనేడ్లతోపాటు (Chinese grenades) పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పూంచ్ సెక్టార్‌లోని ఒక చోట ఆయుధాలున్నట్లు నిఘా సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 20 చైనా హ్యాండ్ గ్రెనేడ్లతో సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం తరలించేందుకు వాటిని అక్కడ దాచినట్లు భద్రతా సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. సకాలంలో వీటిని గుర్తించి స్వాధీనం చేసుకోవడంతో ఉగ్రవాద కుట్రను భగ్నం చేసినట్లు అధికారులు తెలిపారు.
కాగా, కశ్మీర్‌లోని ఏడు జిల్లాలైన శ్రీనగర్, బారాముల్లా, అనంత్‌నాగ్, కుప్వారా, హంద్వారా, పుల్వామా, షోపియన్‌లో జమ్ముకశ్మీర్ పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ సిబ్బంది కలిసి సోదాలు నిర్వహించారు. ఉగ్రవాద నేరాలకు సంబంధించిన డిజిటల్ పరికరాలతోపాటు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
Also Read:
Shooting at Lucknow mall | లక్నో మాల్ వద్ద కాల్పులు.. నలుగురు అరెస్ట్
Woman Stabs Boyfriend | పెళ్లి విషయంపై గొడవ.. ప్రియుడ్ని కత్తితో పొడిచి చంపిన మహిళ
Watch: అర్ధరాత్రి వేళ ఆకాశంలో ప్రకాశవంతమైన కాంతులు.. వీడియో వైరల్