లక్నో: ఆలయం పునరుద్ధరణ పనుల కోసం తవ్వకాలు జరిపారు. ఈ సందర్భంగా బ్రిటీష్ కాలం నాటి వెండి నాణేలు బయటపడ్డాయి. (British-era silver coins) దీంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. పురావస్తు శాఖకు సమాచారం ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శ్రీ లోధేశ్వర్ మహాదేవ ధామ్ ఆలయం పునరుద్ధరణ జరుగుతున్నాయి. ఆలయ కారిడార్ నిర్మాణంలో భాగంగా అక్కడ కూల్చిన ఇళ్ల పునాదులను కార్మికులు తవ్వారు. ఈ సందర్భంగా బ్రిటీష్ కాలానికి చెందిన రూపాయి వెండి నాణేలు బయటపడ్డాయి.
కాగా, తొలుత వందకుపైగా వెండి నాణేలతో ఉన్న మట్టి కుండను కూలీలు గుర్తించినట్లు తెలిసింది. వాటిని వారు పంచుకోవడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు కలిసి అక్కడకు చేరుకున్నారు. 1882 నాటి బ్రిటీష్ కాలానికి చెందిన 75 వెండి రూపాయి నాణేలను స్వాధీనం చేసుకున్నారు. కూలీలు పంచుకున్న మిగతా నాణేల స్వాధీనానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు పురాతన వెండి నాణేలు లభించిన ఆ ప్రాంతంలో నిధి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో అక్కడకు ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఈ నాణేల గురించి పురావస్తు శాఖకు సమాచారం ఇచ్చినట్లు జాయింట్ మేజిస్ట్రేట్ గుజితా అగర్వాల్ తెలిపారు. వారి దర్యాప్తు తర్వాత ఈ నాణేల ప్రాముఖ్యత, ఇతర విషయాలు తెలుస్తాయని అన్నారు.
Also Read:
Man Slits Wife Throat | భార్యతో రాజీ కోసం 175 కిలోమీటర్లు ప్రయాణించి.. ఆమె గొంతు కోసిన భర్త
Chinese grenades | జమ్ముకశ్మీర్లో చైనా గ్రెనేడ్లు స్వాధీనం.. ఉగ్రవాద కుట్ర భగ్నం
Shooting at Lucknow mall | లక్నో మాల్ వద్ద కాల్పులు.. నలుగురు అరెస్ట్
Watch: అర్ధరాత్రి వేళ ఆకాశంలో ప్రకాశవంతమైన కాంతులు.. వీడియో వైరల్