ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేకు (Eknath Shinde) చెందిన సోషల్ మీడియా ‘ఎక్స్’ ఎకౌంట్ ఆదివారం హ్యాక్ అయ్యింది. హ్యాకర్లు అందులో పాకిస్థాన్, టర్కీ జండాల ఫొటోలను పోస్ట్ చేశారు. దీనిని గుర్తించిన ఏక్నాథ్ షిండే సోషల్ మీడియా పర్యవేక్షణ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆసియా కప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య రెండో మ్యాచ్ ఆదివారం జరుగనున్నది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ఎక్స్ ఖాతా హ్యాక్ అయ్యింది. ఇస్లామిక్ దేశాలైన పాకిస్థాన్, టర్కీ జండాల ఫొటోలను హ్యాకర్లు అందులో పోస్ట్ చేశారు.
కాగా, ఏక్నాథ్ షిండే ‘ఎక్స్’ ఎకౌంట్‌ను పర్యవేక్షించే అధికారి దీనిని గమనించారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో సుమారు 45 నిమిషాల తర్వాత హ్యాక్ అయిన ఏక్నాథ్ షిండే ‘ఎక్స్’ ఖాతాను పునరుద్ధరించినట్లు ఆ అధికారి వెల్లడించారు.
Also Read:
British-era silver coins | ఆలయ పునరుద్ధరణ కోసం తవ్వకాలు.. బయటపడిన బ్రిటీష్ కాలం నాటి వెండి నాణేలు
Man Slits Wife Throat | భార్యతో రాజీ కోసం 175 కిలోమీటర్లు ప్రయాణించి.. ఆమె గొంతు కోసిన భర్త
Watch: అర్ధరాత్రి వేళ ఆకాశంలో ప్రకాశవంతమైన కాంతులు.. వీడియో వైరల్