హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని కోర్టు ల్లో ఈ నెల 28న లోక్ అదాలత్‌లు జరుగనున్నాయి. సివిల్, ఎక్సైజ్ కేసు లు, కార్మిక వివాదాలు తదితర వాటి ని ఇరుపక్షాల సమ్మతితో లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవచ్చని టీఎస్ఎల్ఎస్ఏ సభ్య కార్యదర్శి పంచాక్షరి తెలిపారు. లోక్ అదాలత్‌లో కేసులను పరిషరించుకోవాలనుకునే వారు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మ న్, న్యాయసేవా సదన్, మండల కమిటీలను సంప్రదించాలన్నారు.