లండన్: బ్రిటన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఆండీ బర్న్‌హమ్.. తన కొత్త కేబినేట్(UK Cabinet)ను ఆవిష్కరించారు. అయితే లేబర్పార్టీకి చెందిన ముగ్గురు భారత సంతతి ఎంపీలకు ఆయన ప్రభుత్వంలో కీలక పదవులు దక్కాయి. ఆ జాబితాలో కనిష్క నారాయన్, సత్వీర్ కౌర్, హర్‌ప్రీత్ ఉప్పల్ ఉన్నారు. కనిష్క నారాయన్‌కు కేబినెట్లో చోటు దక్కింది. బ్రిటన్ సర్కారులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాఖకు తొలి మంత్రిగా నియమితులయ్యారు. ఇక సత్వీర్ కౌర్, హర్‌ప్రీత్ ఉప్పల్.. అత్యున్నత ప్రభుత్వ హోదాలో నియమితులయ్యారు. వీరితో పాటు శ్రీలంక తమిళ సంతతికి చెందిన హిందూ ఎంపీ ఉమా కుమరన్ ఆ దేశ విదేశీ ఆఫీసులో జూనియర్ మంత్రి పదవి దక్కించుకున్నారు. కీర్ స్టార్మర్ ప్రధానిగా ఉన్న సమయంలో సీమా మల్హోత్రా, ప్రీత్ కౌర్ గిల్ మంత్రులుగా చేశారు. ఇప్పుడు వాళ్లు వెనక బెంచీలకు వెళ్లిపోయారు.
కనిష్క నారాయన్.. బీహార్‌లోని ముజాఫర్పూర్లో జన్మించారు. ఆయన ఫ్యామిలీ వేల్స్‌కు వలసవెళ్లింది. 12 ఏళ్ల వయసులో ఆయన లండన్ వెళ్లారు. ఈటన్ కాలేజీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీల్లో చదువుకున్నారు. గ్లామోర్గన్ సీటు నుంచి ఆయన ఎంపీగా ఎన్నియ్యారు. గతంలో సైన్స్, ఇన్నోవేషన్, టెక్నాలజీ శాఖ కార్యదర్శిగా చేశారు.
సత్వీర్ కౌర్.. సౌతాంప్టన్ నుంచి ఎంపీ అయ్యారు. 2024 జూలైలో పార్లమెంట్‌కు తొలిసారి ఎన్నికయ్యారు. ఆమె పేరెంట్స్ పంజాబ్‌కు చెందినవారు. సౌతాంప్టన్‌లో చీరల షాపు ఉండేది. మినిస్ట్రీ ఫర్ ఈక్వాలిటీస్లో సహాయ మంత్రిగా చేశారు. హోంశాఖలో కూడా సెక్రటరీగా చేశారు. పార్లమెంటరీ సెక్రటరీగా కూడా ఆమె కొంత కాలం చేశారు. 2025 సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి 2026 వరకు ఆమె మెటర్నిటీ లీవ్‌లో ఉన్నారు.
హర్‌ప్రీత్ ఉప్పల్.. హడ్డర్స్‌ఫీల్డ్ నుంచి ఎన్నియ్యారు. అసిస్టెంట్ విప్‌గా నియమితులయ్యారు. పార్లమెంటరీ బిజినెస్‌కు చెందిన ఆదేశాలు ఇస్తుంటారు. ఓటింగ్ సమయంలో ఎంపీలకు కీలక ఆదేశాలు ఇస్తారు. గతంలో ఆమె గ్రేటర్ మాంచెస్టర్ మేయర్ క్యాంపేన్‌లో బర్న్హమ్తో కలిసి పనిచేశారు.