Karim Khan | లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్‌పై వేటు
Karim Khan | అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) లో తీవ్ర కలకలం రేగింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థ చీఫ్ ప్రాసిక్యూటర్ (Chief Proceuter) కరీం ఖాన్ (Karim Khan) ను పదవి నుంచి తొలగించారు. అత్యంత కీలకమైన హోదాలో ఉన్న వ్యక్తిపై ఇటువంటి చర్యలు తీసుకోవడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయ్యింది.
Karim Khan : అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) లో తీవ్ర కలకలం రేగింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థ చీఫ్ ప్రాసిక్యూటర్ (Chief Proceuter) కరీం ఖాన్ (Karim Khan) ను పదవి నుంచి తొలగించారు. అత్యంత కీలకమైన హోదాలో ఉన్న వ్యక్తిపై ఇటువంటి చర్యలు తీసుకోవడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయ్యింది. బ్రిటిష్ న్యాయవాది (British Lawyer) అయిన కరీం ఖాన్ ఐసీసీలో చీఫ్ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తనతో పనిచేసే ఓ మహిళా ఉద్యోగిపట్ల ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ చేపట్టిన అనంతరం ఆయనను పదవి నుంచి తప్పించాలని తీర్మానం ప్రవేశపెట్టారు. ఐసీసీలో మొత్తం 125 సభ్యదేశాలు ఉండగా ఈ తీర్మానానికి మెజారిటీ దేశాలు ఆమోదం తెలిపాయి. దాంతో కరీం ఖాన్‌ను తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి లైంగిక ఆరోపణల కారణంగా ఉద్వాసనకు గురికావడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

