అన్నదాతపై అశనిపాతం.. కన్నీరు పెట్టిస్తున్న ‘మురసు’
మొన్నటి అర్నబ్ మిగిల్చిన చేదు జ్ఞాపకాలు మరువకముందే.. నేడు ముంచుకొచ్చిన మురసు తుఫాను అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు, ఈదురు గాలులకు జూలూరుపాడు మండల వ్యాప్తంగా వ్యవసాయం అతలాకుతలమైంది.
– జూలూరుపాడులో ఈదురు గాలులకు నేలకొరిగిన మిర్చి తోటలు
– నీట మునిగిన పొట్టదశలోని వరి, దెబ్బతిన్న పత్తి పంటలు
- ప్రమాదకరంగా ఉప్పొంగుతున్న వాగులు, వంకలు
– బేతాలపాడు-నర్సాపురం రాకపోకలు బంద్
- అప్రమత్తమైన అధికారులు, ప్రజా ప్రతినిధులు
జూలూరుపాడు, నవంబర్ 04 : మొన్నటి అర్నబ్ మిగిల్చిన చేదు జ్ఞాపకాలు మరువకముందే.. నేడు ముంచుకొచ్చిన మురసు తుఫాను అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు, ఈదురు గాలులకు జూలూరుపాడు మండల వ్యాప్తంగా వ్యవసాయం అతలాకుతలమైంది. ఆరుగాలం శ్రమించి ప్రాణ సమానంగా సాగు చేసిన పంటలు చేతికొచ్చే దశలో ప్రకృతి కన్నెర్రజేయడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎటు చూసినా నీటమునిగిన పొలాలు, నేలకొరిగిన పంటలే దర్శనమిస్తూ అన్నదాత ఆవేదనను, తీరని నష్టాన్ని కళ్లకు కడుతున్నాయి. మురసు తుఫాను తాకిడికి మండలంలో ప్రధానంగా పత్తి, మిరప, కూరగాయల పంటలకు అపార నష్టం వాటిల్లింది. రాత్రి వీచిన బలమైన ఈదురు గాలులు, ఎడతెరిపిలేని వర్షానికి ఏపుగా పెరిగిన మిర్చి తోటలు ఎకరాకు ఎకరాలు నేలకొరిగాయి. పూత, కాయ దశలో ఉన్న పత్తి పంట వర్షార్పణమై రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పొట్టదశకు చేరిన వరి పంట పూర్తిగా నీటమునగడంతో రైతాంగం లబోదిబోమంటోంది.

అన్నదాతపై అశనిపాతం.. కన్నీరు పెట్టిస్తున్న ‘మురసు’
అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతన్నలకు ఈ తుఫానులు కోలుకోలేని దెబ్బతీశాయి.భారీ వర్షాలకు మండలంలోని వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. సూరారం సమీపంలోని వాగు, కాకర్ల గ్రామ సమీపంలోని ఎర్ర వాగు, పడమట నర్సాపురం – బేతాలపాడు గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగు ,తుమ్మల వాగు, అన్నారుపాడు తదితర గ్రామాల్లోని వాగులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి కురిసిన భారీ వర్షానికి తుమ్మల వాగు అత్యంత ప్రమాదకరంగా ఉప్పొంగుతుండటంతో బేతాలపాడు, నర్సాపురం గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ఉధృతి, వాగుల ప్రమాద స్థాయిని గమనించిన అధికారులు, గ్రామ పంచాయతీల ప్రజా ప్రతినిధులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రమాదాల నివారణకు వాగుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి, రాకపోకలను కట్టడి చేస్తున్నారు. అయితే, జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం తక్షణమే అంచనా వేసి, పరిహారం అందించి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

అన్నదాతపై అశనిపాతం.. కన్నీరు పెట్టిస్తున్న ‘మురసు’
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

