RS Praveenkumar | శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా.. సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveenkumar | నేను గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు మహబూబ్‌నగర్ ఎంపీ బలరాం నాయక్ నా దగ్గరికి వచ్చి కబ్జా చేసేందుకు సహకరించమని కోరాడు.. కానీ నేను ఒప్పుకోలేదు. అక్కడ గుడిసెలు వేసుకున్న వాళ్లకు బలరాం నాయక్ డబ్బులు ఇస్తున్నాడని బీఆర్ ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ఆరోపించారు.
RS Praveenkumar | శేరిలింగంపల్లిలో 4 ఎకరాల 13 గుంటల ప్రభుత్వ భూమిని బహిరంగంగా కబ్జా చేస్తున్నారు.. మాకున్న క్షేత్రస్థాయిలో మేం కనుకున్న సమాచారం మేరకు దీని వెనుక మహబూబ్‌నగర్ ఎంపీ బలరాం నాయక్ ఉన్నారని అక్కడున్న స్థానికులు చెబుతున్నారని బీఆర్ ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నేను ఎందుకు ఇది క్లియర్ గా ప్రభుత్వ భూమి అని చెప్తున్నానంటే.. నేను 2012 నుంచి 2021 వరకు సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీగా పని చేశా. ఆ సమయంలో మరి ఎస్సీ సబ్‌ప్లాన్ యాక్ట్ 2013లో వచ్చింది. మేమేదో దళిత ప్రేమికులం.. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితులు.. దళితుంటే కాంగ్రెస్‌పార్టీనే అని ప్రతీ రోజూ కూడా బాజా భజంత్రీలతో చెప్తూ ఉన్నారు. కానీ మీరు ఎస్సీలు, ఎస్టీలను ఎంత ఘోరంగా మోసం చేస్తున్నారనేది ఉదాహరణలతో మీకు చెప్పాలనుకున్నామన్నారు.
కబ్జా చేసేందుకు సహకరించమని కోరాడు..
2013లో ఎస్సీ సబ్‌ప్లాన్‌లో భాగంగా అప్పుడున్న నోడల్ ఏజెన్సీ అంటే దానికి హెడ్ గౌరవ ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇదే శేరిలింగంపల్లి 4 ఎకరాల 13 గుంటలను టీచర్స్ కెపాసిటీ బిల్దింగ్ సెంటర్ (టీసీబీసీ) అనే సంస్థను సాంఘీక సంక్షేమ శాఖ ద్వారా ఏర్పాటు చేసి అదే విధంగా అందులో ఒక గురుకుల పాఠశాలను కూడా ఏర్పాటు చేయాలని.. ఆ 4 ఎకరాల 13 గుంటల్లో ఈ బిల్డింగ్ కట్టడానికి రూ.31 కోట్లు మంజూరు చేశారు. ఈ ప్రొసీడింగ్స్ నా దగ్గరున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు..
దాని తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ భూమిని ఒకప్పుడు ఎస్సీ కార్పోరేషన్ దగ్గరుండే భూమిని ఎస్సీలెవరూ వినియోగించుకోవడం లేదు.. దీని వల్ల ఈ భూమి నిరుపయోగంగా మారుతుందని.. దీన్ని సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థకు ఇచ్చేశారు. మా దగ్గర ఉన్నా డాటా. 2014లో ఈ భూమిలో టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్ సెంటర్ కట్టాలి.. ఎవరెస్ట్ ఎక్కిన గురుకుల విద్యార్థులను కేవలం డప్పులు కొట్టే కుటుంబాలకే పరిమితం చేయకూడదు.. డప్పులు కొట్టే కుటుంబాలు డాలర్లు కూడా సంపాదించాలని కేసీఆర్ మాకిచ్చిన ఆదేశాల మేరకు 2016లో అక్కడొక 16 అంతస్తుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కట్టాలని మేం ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించాం.. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ను ఆ రోజుల్లోనే మాకు జరిగిన రివ్యూ మీటింగుల్లో ఉండే ఫైల్స్ అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి.. కాబట్టి వాటిని ఈ రోజు సాక్ష్యాలుగా చూపిస్తున్నానన్నారు. .
నేను గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు బలరాం నాయక్ నా దగ్గరికి వచ్చి కబ్జా చేసేందుకు సహకరించమని కోరాడు.. కానీ నేను ఒప్పుకోలేదు. అక్కడ గుడిసెలు వేసుకున్న వాళ్లకు బలరాం నాయక్ డబ్బులు ఇస్తున్నాడని ఆరోపించారు.
భూకబ్జా వెనుక మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ బలరాం నాయక్
శేరిలింగంపల్లిలో 4 ఎకరాల 13 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు
ఈ భూకబ్జా వెనుక మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉన్నట్టు స్థానికులు చెప్తున్నారు
ఈ భూమిలో గతంలో గురుకుల పాఠశాల నిర్మించడానికి రూ.31 కోట్లు మంజూరు చేశారు
నేను గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు బలరాం నాయక్ నా దగ్గరికి వచ్చి కబ్జా చేసేందుకు సహకరించమని కోరాడు.. కానీ నేను ఒప్పుకోలేదు
అక్కడ గుడిసెలు వేసుకున్న వాళ్లకు బలరాం నాయక్ డబ్బులు ఇస్తున్నాడు
– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
— Telugu Scribe (@TeluguScribe) November 4, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveenkumar | శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా.. సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అన్నదాతపై అశనిపాతం.. కన్నీరు పెట్టిస్తున్న ‘మురసు’
Beauty tips | మీ చర్మాన్ని యవ్వనంగా మార్చే బొటాక్స్ ట్రీట్మెంట్ గురించి తెలుసా..?
Ambati Rambabu | రాజకీయ కుట్రతోనే ఈడీ నోటీసులు : మాజీ మంత్రి అంబటి రాంబాబు
సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

