సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి : ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తాళ్లపాయి గ్రామంలోని పాములేరు వాగు వరద ఉధృతిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో వాగులో పెరుగుతున్న వరద ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాల్లో...
– పాములేరు వాగు వరద ఉధృతి పరిశీలన
– తాళ్లపాయి- బూర్గంపహాడ్ మధ్య నిలిచిన రాకపోకలు
ములకలపల్లి, నవంబర్ 04 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తాళ్లపాయి గ్రామంలోని పాములేరు వాగు వరద ఉధృతిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో వాగులో పెరుగుతున్న వరద ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాల్లో వరద ప్రభావాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాములేరు వాగులో వరద ఉధృతి కారణంగా తాళ్లపాయి గ్రామం నుండి బూర్గంపహాడ్ వెళ్లే మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజల భద్రత దృష్ట్యా ఈ మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. వరద ఉధృతి తగ్గే వరకు ప్రజలు ఈ మార్గంలో ప్రయాణించవద్దని, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు.
వర్షాలు ఇదే విధంగా కొనసాగి వరద ఉధృతి మరింత పెరిగితే స్థానిక ప్రజలను ముందస్తుగా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు. ప్రజల భద్రత దృష్ట్యా అవసరమైన సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డీడీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ప్రజలు వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి : ఎస్పీ రోహిత్ రాజు
చండ్రుగొండలో నీట మునిగిన పంట పొలాలు
BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

