హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు పార్టీకి ఆయువుపట్టు గా ఉన్న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) మొత్తం లొంగిపోయేందుకు సిద్ధమైంది. వీరితో సహా.. రాష్ట్రంలోని పలువు రు కీలక నేతలకు అండగా ఉన్న మిగతా క్యాడర్ కూడా తెలంగాణ పోలీసులతో టచ్లోకి వచ్చారు. లొంగుబాటులో రాష్ట్రస్థాయి నేతలు మొత్తం 100 మందికిపైనే క్యా డర్ ఉన్నట్టు సమాచారం. వీరిలో ఏసీఎం, డీసీఎం స్థాయి వారు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. వీరి లొంగుబాటుతో అత్యధికంగా మావోయిస్టులు లొంగిపోయిన రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలువనున్నది. ఆ తర్వాత.. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించే అవకాశం ఉన్నది.