Vijay-Sangeetha Divorce Row | ప్రముఖ తమిళ నటుడు, ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అధినేత విజయ్‌కు ఆయన భార్య సంగీత నుంచి మరో కొత్త షాక్ తగిలింది. వీరిద్దరి మధ్య జరుగుతున్న విడాకుల వివాదంలో తాజాగా ఆమె చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఒక కీలక పిటిషన్‌ను దాఖలు చేసింది. విడాకుల కేసు విచారణ పూర్తయ్యే వరకు చెన్నైలోని నీలంకరైలో ఉన్న తమ సొంత నివాసంలోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోర్టును కోరింది. ఒకవేళ విడాకుల ప్రక్రియతో ముందుకు వెళ్తే ఆ ఇంటిని ఖాళీ చేయాలని విజయ్ తరపు న్యాయవాదులు తనను హెచ్చరించారని, అయితే బ్రిటీష్ పౌరసత్వం కలిగిన తనకు చెన్నైలో ప్రత్యామ్నాయ నివాసం లేదని సంగీత పేర్కొన్నారు. విజయ్ హోదాకు తగినట్లుగా తన పిల్లలతో కలిసి ఆ ఇంట్లో నివసించే హక్కు తనకు ఉందని ఆమె తన పిటిషన్లో స్పష్టం చేసింది.
విజయ్‌కు ఒక ప్రముఖ నటితో ఉన్న సంబంధమే ఈ గొడవలకు కారణమని, దీనివల్ల 2021 నుంచి తాను తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నానని సంగీత ఆరోపించారు. విడాకుల సెటిల్మెంట్లో భాగంగా భారీ మొత్తంలో భరణం కూడా కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధమవుతున్న తరుణంలో, ఈ వ్యక్తిగత వివాదం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పిటిషన్‌పై స్పందించిన కోర్టు విజయ్‌కు నోటీసులు జారీ చేసింది, తదుపరి విచారణను 2026, ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.