లక్నో: సహజీవనం చేసిన యువతిని ఒక వ్యక్తి హత్య చేశాడు. (Man Kills Live-In Partner) ఆమె మృతదేహాన్ని బ్యాగులో కుక్కాడు. నదిలో పడేసే ముందు సెల్ఫీ తీసుకున్నాడు. మహిళ మిస్సింగ్ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తితో పాటు సహకరించిన ఫ్రెండ్‌ను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. 20 ఏళ్ల ఆకాంక్ష తన సోదరితో కలిసి కాన్పూర్‌లోని ఒక రెస్టారెంట్లో పని చేసింది. కొంతకాలం సోదరితో కలిసి నివసించింది.
కాగా, కొన్ని నెలల కిందట ఆకాంక్షకు ఇన్‌స్టాగ్రామ్‌లో సూరజ్ కుమార్ ఉత్తమ్ పరిచయమయ్యాడు. తొలుత మొబైల్ ఫోన్లలో మాట్లాడుకున్న వారిద్దరూ ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్ అయిన సూరజ్ తరచుగా ఆకాంక్ష పని చేసే రెస్టారెంట్ వద్దకు వచ్చి ఆమెను కలిసేశాడు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి హనుమంత్ విహార్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో సహజీవనం చేస్తున్నారు.
మరోవైపు ఆకాంక్ష మరో వ్యక్తితో మాట్లాడటాన్ని సూరజ్ గమనించాడు. దీంతో అతడితో ఆమెకు సంబంధం ఉందని అనుమానించాడు. జూలై 21న ఈ అంశంపై వారిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇది హింసాత్మకంగా మారింది. ఘర్షణ నేపథ్యంలో ఆకాంక్ష తలను సూరజ్ గోడకేసి బాదాడు. ఆ తర్వాత గొంతునొక్కి ఆమెను చంపాడు.
అయితే ఆకాంక్ష హత్యను కవర్ చేసేందుకు స్నేహితుడు ఆశిష్ కుమార్‌కు సూరజ్ ఫోన్ చేశాడు. అతడి సహాయంతో ఆమె మృతదేహాన్ని ఒక బ్యాగులో కుక్కాడు. బైక్‌పై బాండా ప్రాంతానికి బయలుదేరారు. మార్గమధ్యలో ఆకాంక్ష మృతదేహాన్ని కుక్కిన బ్యాగుతో సూరజ్ సెల్ఫీ తీసుకున్నాడు. ఆ తర్వాత మృతదేహం ఉన్న బ్యాగును యమునా నదిలో పడేశారు.
కాగా, కుమార్తె కనిపించకపోవడంతో ఆకాంక్ష తల్లి ఆందోళన చెందింది. ఆగస్ట్ 8న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను సూరజ్ కిడ్నాప్ చేసినట్లు ఆరోపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొబైల్ ఫోన్ల డాటాతోపాటు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు.
చివరకు సెప్టెంబర్ 18న నిందితులైన సూరజ్ కుమార్ ఉత్తమ్, సహకరించిన అతడి స్నేహితుడు ఆశిష్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించగా నిజం ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. రిమాండ్ నిమిత్తం వారిద్దరిని జైలుకు తరలించినట్లు వివరించారు. ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Woman Dies By Suicide | హత్యకు గురైన ప్రియుడు.. ప్రియురాలు ఆత్మహత్య
Air India Plane | ఎక్కని ప్రయాణికుడు.. వెనక్కి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం
Ship Catches Fire | సొమాలియా వెళ్లే నౌకలో మంటలు.. లోడ్ చేసిన బియ్యం బస్తాలు ఆహుతి
Watch: గర్బా నృత్యం ప్రాక్టీస్ చేస్తున్న మహిళను కిడ్నాప్.. తర్వాత ఏం జరిగిందంటే?