జనగామ : జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Sandeep Kumar Jha)వివాదాస్పద నిర్ణయంతో ఓ నిరుపేద దళిత కుటుంబం రోడ్డున పడింది. వివరాల్లోకి వెళ్తే..ఇందిరా మహిళా శక్తి పథకం కింద మంజూరైన వనిత టీ స్టాల్,(Vanitha tea stall) మిల్క్ పార్లర్‌ను జిల్లా కలెక్టరేట్ ఎదురుగా పూర్వ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ప్రారంభించారు.
కాగా, దీనిని తొలగించాలంటూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాలు జారీ చేయడంతో వనిత టీ స్టాల్‌ను మున్సిపల్ అధికారులు తొలగించారు. సీపీఎం నాయకులు అడ్డుపడినప్పటికి అధికారులు అక్కడ నంచి టీస్టాల్‌ను తొలగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.