బీబీనగర్, జూలై 27 : బీబీనగర్ మండలంలోని రాఘవాపురం గ్రామ చెరువు తూము పూర్తిగా దెబ్బతినడంతో పాటు చెరువు కట్ట బలహీనంగా మారిందని, వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావుకు గ్రామ సర్పంచ్ సిద్ధగొని శ్రీకాంత్ గౌడ్ తో పాటు గ్రామ ప్రజా ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ చెరువును సంబంధిత అధికారులు తక్షణమే పరిశీలించి చెరువు తూము, చెరువు కట్ట మరమ్మతు పనులు చేపట్టి రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఉప సర్పంచ్ సిలువెరీ కవిత మహేష్, వార్డు సభ్యులు దొంతిరెడ్డి రాజశేఖరరెడ్డి, తోరుపునూరి రవి, న్యాలపట్ల అజయ్, జక్కి నగేష్, రక్తని పూర్ణిమ కుమార్, పొట్ట మంగమ్మ నరేందర్, గుంటిమిది విజయలక్ష్మి రవీందర్ పాల్గొన్నారు.