సీజనల్ వ్యాధుల పట్ల చర్యలు చేపట్టాలని వినతి
తుంగతుర్తి ప్రాంతంలోని పలు గ్రామాల్లో చిరు జల్లులు కురవడంతో ప్రజలు విష జ్వరాలు, సీజనల్ వ్యాదుల భారిన పడుకున్నారని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. ముందస్తు నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతూ బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి...
తుంగతుర్తి, సెప్టెంబర్ 23 : తుంగతుర్తి ప్రాంతంలోని పలు గ్రామాల్లో చిరు జల్లులు కురవడంతో ప్రజలు విష జ్వరాలు, సీజనల్ వ్యాదుల భారిన పడుకున్నారని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. ముందస్తు నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతూ బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీజన్ వ్యాధుల పట్ల వైద్య అధికారులు తగిన చర్యలు చేపట్టాలని, పేద ప్రజలకు సకలంలో నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. అనంతరం వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులను వారు పరిశీలించారు.
తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలోనే వంద పడకల ఆస్పత్రి నిర్మాణం ప్రారంభమైందని, స్థానిక ఎమ్మెల్యే మందుల సామ్యూల్ అధికారులతో రివ్యూ చేసి సకాలంలో ఆస్పత్రి నిర్మాణం పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు గోపగాని రమేష్, గోపాగాని వెంకన్న, బొంకూరి మల్లేష్, ఉప్పుల నాగామల్లు, గుడిపాటి వీరయ్య, గడ్డం సోమేశ్, మల్లెపాక ముత్తయ్య, బొజ్జ సాయికిరణ్, పాలడుగు జలంధర్, మల్లెపాక యాదగిరి, కొల్లూరి మహేందర్, లాకావత్ సోమన్న, దారవాత హేమ్లా నాయక్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

