– గిరిజన మహిళలతో కలిసి సాంప్రదాయ నృత్యాలు
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 23 : గణేష్ వినాయక నిమజ్జనం ఊరేగింపు వేడుకలు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ప్రధాన ఆకర్షణగా వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి నిలిచారు. మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డు సమైక్యత గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గిరిజన మహిళలు సాంప్రదాయ ముత్యాలతో ఈఎంసి వాసులను ఆకట్టుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే వార్డు ప్రజలు, గిరిజన మహిళలతో కలిసి నృత్యాలు వేసి చూపర్లను ఆకట్టుకున్నారు. ఒకవైపు అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షం కురుస్తున్న ఈఎంసి పరిధిలో ఊరేగింపు వేడుకలు యధావిదంగా కొనసాగాయి. పలు వార్డులలో యువకులు దేఖ్లేంగే, సారే రావాలి, గులాబీల జెండాలమ్మ అనే పాటలకు డ్యాన్సులు వేస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు.

గణేష్ ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే చంద్రావతి సందడి