వ్యవసాయానికి కోతలు లేని కరెంటు అందించాలని నిరసన
రైతులు సాగు చేస్తున్న పంట పొలాలకు కోతలు లేని నాణ్యమైన కరెంటును అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ తుంగతుర్తి శ్రేణులు బుధవారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గొట్టిపర్తి గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు...
తుంగతుర్తి, సెప్టెంబర్ 23 : రైతులు సాగు చేస్తున్న పంట పొలాలకు కోతలు లేని నాణ్యమైన కరెంటును అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ తుంగతుర్తి శ్రేణులు బుధవారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గొట్టిపర్తి గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బర్ల సోమన్న మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు సాగు చేస్తున్న పంట పొలాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియా, కరెంటు, కాల్వల ద్వారా సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రైతులు పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగేష్, తాళ్లపల్లి యాకయ్య, చింతకుంట్ల సురేష్, శ్రీనివాస్, ఏకయ్య, కృష్ణ, పలువురు రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

