Mysaa Teaser | కన్నడ భామ రష్మిక మందన్నా తొలిసారి యాక్షన్ అవతార్‌లో కనిపించబోతున్న ప్రాజెక్ట్ మైసా (Mysaa). పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన రష్మిక మందన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్ అవువూ సినిమాపై అంచనాలు పెంచేస్తుందని తెలిసిందే. ఇక రెండు రోజుల క్రితం లాంచ్ చేసిన టీజర్ రష్మిక మందన్నాలోని మరో యాంగిల్‌ను చూడబోతున్నట్టు చెప్పేస్తుంది.
డీగ్లామరైజ్డ్గా యాక్షన్ అవతార్‌లో గూస్బంప్స్ తెప్పించే యాక్టింగ్‌తో అదరగొట్టేస్తుంది. మైసా టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. టీజర్ లాంచ్ చేసిన కొన్ని గంటల్లోనే 25 మిలియన్లకుపైగా వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. రష్మిక మందన్నా ఊహించని లుక్‌లో అదరగొట్టేస్తూ.. విజయశాంతిని గుర్తుకు తెస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు మూవీ లవర్స్.
ఈ మూవీలో రష్మిక మందన్నా గోండ్ గిరిజన మహిళగా కనిపించనుందని టీజర్‌తో తెలిసిపోతుంది. మైసా సినిమాతో Rawindra Pulle డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ అందిస్తున్నాడు. ఈ మూవీలో పుష్ప 2 విలన్ తారక్ పొన్నప్ప కీలక పాత్రలో నటిస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ ఎంట్రీతోనే బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి.
25MILLION+ ORGANIC VIEWS across the INTERNET for #MysaaTeaser ❤️🔥
TRENDING EVERYWHERE with phenomenal response 💥
— https://t.co/561uhHHHpg#MYSAA IN CINEMAS WORLDWIDE ON 27.11.26. 🔥 pic.twitter.com/NTyQGHE8Nq
— BA Raju’s Team (@baraju_SuperHit) September 23, 2026
UDP MLAs Join BJP | 8 మంది యూడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిక.. మేఘాలయలో రెండో అతి పార్టీగా గుర్తింపు
యువత రాజకీయాల్లోకి రావాలి : బీఆర్ఎస్ నాయకుడు కిరణ్ కొమ్రెవార్
BJP in-charges | రాష్ట్రాలకు ఇంఛార్జిలను నియమించిన బీజేపీ.. తెలంగాణకు ఎవరంటే