ఎస్సీ గురుకులాల్లో‘ప్రిన్సిపాళ్ల’ పంచాయితీ
రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో ప్రిన్సిపాళ్ల పంచాయితీ నెలకొన్నది. ఇన్చార్జి ప్రిన్సిపాళ్లుగా కొనసాగేందుకు సీనియర్లు నిరాకరిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు జూనియర్లకు ఆ బాధ్యతలు అప్పగించినప్పటికీ ఇటీవల జరిగిన ఘటనలు, సొసైటీ ఉన్నతాధికారుల తీరుతో వారు సైతం ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారు.
- బాధ్యతల స్వీకరణకు సీనియర్ల నిరాసక్తి
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో ప్రిన్సిపాళ్ల పంచాయితీ నెలకొన్నది. ఇన్చార్జి ప్రిన్సిపాళ్లుగా కొనసాగేందుకు సీనియర్లు నిరాకరిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు జూనియర్లకు ఆ బాధ్యతలు అప్పగించినప్పటికీ ఇటీవల జరిగిన ఘటనలు, సొసైటీ ఉన్నతాధికారుల తీరుతో వారు సైతం ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారు. మరోవైపు ప్రమోషన్ల కోసం డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ)లను వేసినా అవీ ముందుకు సాగడం లేదు. దీంతో ఎస్సీ గురుకులాల్లో పాలన గాడితప్పి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని కాలేజీలు, పాఠశాలల్లో దాదాపు 150 ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రమోషన్ల ద్వారా వాటిని భర్తీ చేయాల్సి ఉన్నది. కానీ, సర్కార్ తీరుతో ఆ ఫైలు దీర్ఘకాలంగా ముందుకు కదలడం లేదు.
సాధారణంగా ఏ గురుకులంలోనైనా ప్రిన్సిపాల్ ఉద్యోగ విరమణ పొందితే వెంటనే అక్కడే ఉన్న సీనియర్ టీచర్‌కు ఇన్చార్జిగా బాధ్యతలను అప్పగించడం పరిపాటి. కానీ ప్రభుత్వం తీరుకు నిరసనగా అనేక మంది సీనియర్ టీచర్లు ఇన్చార్జి ప్రిన్సిపాళ్లుగా బాధ్యతలు స్వీకరించేందుకు నిరాసక్తి చూపుతున్నారు. ప్రమోషన్ల ద్వారానే ఆ విధులను నిర్వర్తించాలనే ఉద్దేశంతో మూకుమ్మడిగా నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం లేదు. సీనియారిటీతో సంబంధం లేకుండా ఇష్టారీతిన జూనియర్లనే ఇన్చార్జి ప్రిన్సిపాళ్లుగా నియమిస్తూ నెట్టుకొస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

