సిద్దిపేట రేవంత్ సభకు వచ్చి మహిళ మృతి
సిద్దిపేటలో గురువారం జరిగిన సీఎం రేవంత్ బహిరంగ సభకు హాజరైన మహిళ బస్సు ప్రమాదం లో మృతిచెందింది.
- కుటుంబ సభ్యులకు మంత్రి పొన్నం పరామర్శ
సిద్దిపేట/హుస్నాబాద్ రూరల్, నవంబర్ 20: సిద్దిపేటలో గురువారం జరిగిన సీఎం రేవంత్ బహిరంగ సభకు హాజరైన మహిళ బస్సు ప్రమాదం లో మృతిచెందింది. హు స్నాబాద్ మండలం నాగా రం గ్రామానికి చెందిన కొమ్మ సారవ్వ సీఎం సభకు వచ్చారు. అనంతరం సభాస్థలి నుంచి పార్కింగ్ చేసిన చోట గ్రామానికి కేటాయించిన బస్సు వద్దకు వెళ్తుండగా, రెండు బస్సుల మధ్యలో ఇరుకోవడంతో గాయపడి కింద పడిపోయింది.
తోటి మహిళలు ఆమెను సిద్దిపేట ఏరియా దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి 10 గంటలకు మృతి చెందింది. ఈ విషయం బయటకు తెలియకుండా కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఉదయం వరకు తొకిపెట్టారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయం సిద్దిపేట ఏరియా దవాఖానకు వచ్చి సారవ్వ మృతదేహానికి నివాళులర్పించారు. కలెక్టర్ హైమావతితో కలిసి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.ఐదు లక్షల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

