ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 23 : ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఎం వెంకటయ్య పాలెం గ్రామానికి చెందిన దరిపెల్లి వెంకన్న అనారోగ్య కారణంతో బుధవారం మరణించారు. విషయం తెలుసుకున్న వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు చంద్రావతి గ్రామంలోని వెంకన్న ఇంటికి వెళ్లి ఆయన పార్టీవదేహాన్ని సందర్శించారు. పార్థీవ దేహంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వెంకన్న కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నివాళులు అర్పించిన వారిలో పలువురు గ్రామ పెద్దలు ఉన్నారు.