– ఎంజీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి
– ఎంజియూలో స్వచ్ఛ ప్లాస్టిక్ నిర్వహణ
రామగిరి, జూలై 27 : ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించడం ద్వారానే సమాజంలో సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుందని నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి అన్నారు. ప్లాస్టిక్ రహిత క్యాంపస్ లక్ష్యంగా ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్, బిజినెస్ మేనేజ్మెంట్, సైన్స్, ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు, విద్యార్థులు పాల్గొని ప్లాస్టిక్ రహిత క్యాంపస్ నిర్మాణంపై స్వచ్ఛందంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ముఖ్యంగా విద్యార్థులు క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో దేశం తీవ్ర పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.వసంత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ నీలకంఠం శేఖర్, డాక్టర్ కిరణ్మయి, రమేష్ నాయక్, డాక్టర్ సత్తిరెడ్డి పాల్గొన్నారు.

‘పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులే కీలకం’