గూడూరు టోల్ ప్లాజాలో ఉచిత ఆరోగ్య శిబిరం
బీబీనగర్ మండలంలోని గూడూరు టోల్ ప్లాజా హైదరాబాద్ - హనుమకొండ టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో, అపెక్స్ హాస్పిటల్ సహకారంతో సోమవారం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సు లక్ష్యంగా చేపట్టిన ఈ శిబిరంలో టోల్ ప్లాజా ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, స్థానిక ప్రజలు, రహదారి వినియోగదారులు..
– ఉద్యోగులు, స్థానికులు, రహదారి వినియోగదారులకు వైద్య సేవలు
బీబీనగర్, జూలై 27 : బీబీనగర్ మండలంలోని గూడూరు టోల్ ప్లాజా హైదరాబాద్ – హనుమకొండ టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో, అపెక్స్ హాస్పిటల్ సహకారంతో సోమవారం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సు లక్ష్యంగా చేపట్టిన ఈ శిబిరంలో టోల్ ప్లాజా ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, స్థానిక ప్రజలు, రహదారి వినియోగదారులు పాల్గొని వైద్య సేవలు పొందారు. శిబిరంలో వైద్య నిపుణులు రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు తదితర ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్ల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ హెడ్ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు సంస్థ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, ఇలాంటి ఆరోగ్య శిబిరాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టోల్ ప్లాజా మేనేజర్ నాగేశ్వరరావు, అకౌంట్స్ మేనేజర్ సతీష్, హెచ్ఆర్ మేనేజర్ భాస్కర్, అపెక్స్ హాస్పిటల్ వైద్య బృందం, టోల్ అధికారులు, ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

గూడూరు టోల్ ప్లాజాలో ఉచిత ఆరోగ్య శిబిరం
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

