భోపాల్: ఒక మహిళ కొందరితో కలిసి గర్బా నృత్యం ప్రాక్టీస్ చేస్తున్నది. ఇంతలో కొందరు వ్యక్తులు అక్కడకు వచ్చారు. ఆ మహిళను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లి కిడ్నాప్ చేశారు. (Woman Practicing Garba Kidnapped) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఖాన్‌పురాలోని భావ్సర్ ధర్మశాలలో మహిళలు, యువతులు గర్బా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
కాగా, అకస్మాత్తుగా నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు అక్కడకు వచ్చారు. డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఒక మహిళను పట్టుకుని అక్కడి నుంచి లాక్కెళ్లారు. ఇది చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు. వారి నుంచి ఆ మహిళను కాపాడేందుకు ఒక యువతి ప్రయత్నించింది. అయితే ఆ గుంపులోని ఒక మహిళ ఆమెను తోసేసింది. వారంతా కలిసి ఆ మహిళను కిడ్నాప్ చేశారు. బలవంతంగా వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అలెర్ట్ అయ్యారు. పోలీస్ బృందాలను రంగంలోకి దించారు. చెక్‌పోస్టుల వద్ద వాహనాలను తనిఖీ చేశారు. చివరకు ఆ వాహనాన్ని గుర్తించి అడ్డుకున్నారు. వారి చెర నుంచి ఆ మహిళను రక్షించారు. ఆమె కిడ్నాప్‌కు ప్రయత్నించిన ఇద్దరు మహిళలతో సహా ఎడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, గరోత్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన ఆ మహిళ భర్త మద్యానికి బానిస అయ్యాడని పోలీస్ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో భర్తను వీడిన ఆమె గత మూడు నెలలుగా యష్ అనే వ్యక్తితో కలిసి మందసౌర్‌లో సహజీవనం చేస్తున్నదని చెప్పారు. దీనికి అంగీకరించని మహిళ కుటుంబ సభ్యులు శనివారం రాత్రి ఆమెను కిడ్నాప్ చేసి బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
मध्यप्रदेश –
मंदसौर में गरबा की प्रैक्टिस कर रही महिला का अपहरण। 4 पुरुष और 2 महिला आए। वो उसको जबरन घसीटकर गाड़ी में ले गए।पुलिस ने नाकेबंदी करके सबको पकड़ा। पता चला कि पति दारूबाज है, पत्नी को पीटता है। इससे तंग आकर वो दूसरे शख्स के साथ लिव इन में रहने लगी थी। किडनैप करने… pic.twitter.com/pOuSQ6WWlU
— Sachin Gupta (@SachinGuptaUP) September 21, 2025
Also Read:
PM Modi | జీఎస్టీ సంస్కరణలు ‘నాగరిక దేవో భవ’ను ప్రతిబింబిస్తాయి: ప్రధాని మోదీ
Girl Gang-Raped | బాలికపై సామూహిక అత్యాచారం.. నలుగురు అరెస్ట్
Woman Dies By Suicide | హత్యకు గురైన ప్రియుడు.. ప్రియురాలు ఆత్మహత్య
Lankan Woman | ఎల్టీటీఈ పునరుద్ధరణకు యత్నం.. శ్రీలంక మహిళపై ఈడీ దర్యాప్తు