న్యూఢిల్లీ: కొత్త తరం జీఎస్టీ సంస్కరణలు ‘నాగరిక దేవో భవ’ను ప్రతిబింబిస్తాయని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఆదివారం జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. తర్వాత తరం జీఎస్టీ సంస్కరణలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని చెప్పారు. జీఎస్టీ పొదుపు పండుగ లాంటిదని తెలిపారు. ‘రేపటి నుంచి నవరాత్రి ప్రారంభమవుతుంది. నవరాత్రి మొదటి రోజు నుంచి ఆత్మనిర్భర్ భారత్ వైపు దేశం అడుగులు వేస్తుంది. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణ అమలవుతాయి. రేపటి నుంచి ‘జీఎస్టీ బచత్ ఉత్సవ్’ ప్రారంభమవుతుంది. వన్ నేషన్ వన్ ట్యాక్స్ కల సాకారమైంది’ అని అన్నారు.
కాగా, జీఎస్టీ సంస్కరణలు భారతదేశ వృద్ధిని వేగవంతం చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. పెట్టుబడి, పొదుపుతో పాటు ఆనందాన్ని పెంచుతుందని చెప్పారు. ఐటీ మినహాయింపు పరిమితి పెంపు, జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు రూ. 2.5 లక్షల కోట్లు ఆదా చేస్తాయని అన్నారు. 2017లో జీఎస్టీ సంస్కరణ ప్రారంభించినప్పుడు పాత చరిత్రను అది మార్చిందని, ప్రస్తుత జీఎస్టీ సంస్కరణలు కొత్త చరిత్ర సృష్టించడానికి నాంది పలికిందని అన్నారు.
మరోవైపు జీఎస్టీ సంస్కరణల వల్ల సంక్లిష్టమైన పన్నుల నుంచి వినియోగదారులు విముక్తి పొందారని ప్రధాని మోదీ తెలిపారు. ప్రతిరోజూ అవసరమైన వస్తువులు పన్ను రహితంగా లేదా 5 శాతం లేదా 18 శాతం జీఎస్టీ కింద ఉంటాయని చెప్పారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు డబుల్ బొనాంజాగా అభివర్ణించారు. ఎంఎస్ఎంఈలతోపాటు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని చెప్పారు. ‘స్వదేశీ శ్రేయస్సును పెంచుతుంది. భారత్లో తయారు చేసిన ఉత్పత్తులను మనం కొనుగోలు చేయాలి. ప్రతి ఇల్లు, షాపు స్వదేశీని సూచించాలి. ఇది జరిగినప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతుంది’ అని మోదీ అన్నారు.
Also Read:
Lankan Woman | ఎల్టీటీఈ పునరుద్ధరణకు యత్నం.. శ్రీలంక మహిళపై ఈడీ దర్యాప్తు
Woman Dies By Suicide | హత్యకు గురైన ప్రియుడు.. ప్రియురాలు ఆత్మహత్య