రాంచీ: నలుగురు వ్యక్తులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. (Girl Gang-Raped) బాధిత యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 17 ఏళ్ల బాలిక బోరిజోర్లోని బంధువుల ఇంటికి చేరుకున్నది. శుక్రవారం స్థానిక సంతకు ఆమె వెళ్లింది. ఈ సందర్భంగా ఆ యువతికి ఒక వ్యక్తి పరిచయమయ్యాడు.
కాగా, బాలికను మభ్యపెట్టిన ఆ వ్యక్తి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ అతడి ముగ్గురు స్నేహితులు కలిశారు. నలుగురు కలిసి ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక ఈ విషయాన్ని తన కుటుంబానికి చెప్పింది. దీంతో వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులైన నలుగురు వ్యక్తులను గుర్తించి వారిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
PM Modi | జీఎస్టీ సంస్కరణలు ‘నాగరిక దేవో భవ’ను ప్రతిబింబిస్తాయి: ప్రధాని మోదీ
Woman Dies By Suicide | హత్యకు గురైన ప్రియుడు.. ప్రియురాలు ఆత్మహత్య
Lankan Woman | ఎల్టీటీఈ పునరుద్ధరణకు యత్నం.. శ్రీలంక మహిళపై ఈడీ దర్యాప్తు