Vijay – Trisha | తమిళ స్టార్ నటుడు, తమిళ వెట్రీ కళగం అధినేత విజయ్ మరియు హీరోయిన్ త్రిషల వ్యక్తిగత జీవితంపై నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల చెన్నైలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్‌కు విజయ్ – త్రిష కలిసి ఒకే కారులో రావడం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారనే వార్తల మధ్య వీరిద్దరూ కలిసి కనిపించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వివాదంపై ఖుష్బూ స్పందిస్తూ.. ఇది పూర్తిగా వారి వ్యక్తిగత విషయమని, దానిని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని పేర్కొంది. విజయ్, త్రిషల వ్యవహారంతో సామాన్య ప్రజలకు ఏం సంబంధం ఉంటుందో తనకు అర్థం కావడం లేదని.. అది వారి పర్సనల్ లైఫ్ అని, దానిని గౌరవించాలని సూచించింది.
విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా ఉన్న నేపథ్యంలో ఈ వివాదం ఆయన ఇమేజ్‌పై ప్రభావం చూపుతుందా? అని అడగ్గా.. ప్రజలు చాలా తెలివైన వారు. ఎవరికి ఓటు వేయాలో వారికి తెలుసు. వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదు అని తెలిపింది. నటులైనా, రాజకీయ నాయకులైనా వారు కూడా మనలాగే సాధారణ మనుషులని, వారి ప్రైవసీని దెబ్బతీయడం సరికాదని ఈ సందర్భంగా ఖుష్బూ చెప్పుకోచ్చింది.