హైదరాబాద్ : నగరంలో ఫేక్ బాంబ్ బెదిరింపులు రావడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. శంషాబాద్ విమానాశ్రయం, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు బాంబు బెదిరింపు ఘటన మరవకముందే తాజాగా.. హైదరాబాద్లోని బేగంపేటలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఉదయం 6 గంటలకు అగంతకులు వాతావరణ శాఖకు మెయిల్ ద్వారా బాంబు ఉందంటూ సందేశం పాంపారు.
ఉదయం 9:30కు మెయిల్ చూసుకుకున్న వాతావరణ కేంద్రం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. అయితే బాంబు బెదిరింపుతో కార్యాలయంలోని సిబ్బంది, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.