Peddi Sudarshan Reddy | నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివదేహం నర్సంపేటకు చేరుకుంది. ఆయన భౌతికకాయాన్ని సందర్శించేందుకు ప్రజలు, అభిమానులు, పార్టీ నాయకులు భారీగా తరలివచ్చారు. తమ అభిమాన నాయకుడిని చివరిసారిగా చూసి పలువురు భావోద్వేగానికి గురయ్యారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తీవ్ర అస్వస్థతతో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో ఐదు రోజులుగా చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం అర్ధరాత్రి 12.50 గంటల తర్వాత తుదిశ్వాస విడిచారు. జూలై 26వ తేదీన ఉదయం హనుమకొండలోని తన నివాసంతో పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో తొలుత స్థానిక ఆస్పత్రికి, ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్టపికీ ఆయన్ను కాపాడలేకపోయారు.
నర్సంపేటకు చేరుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయం https://t.co/VjCrZBPkem pic.twitter.com/1ddCQL5XMr
— Telugu Scribe (@TeluguScribe) July 31, 2026
తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. వరంగల్ జిల్లా నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ సాధనకు అండగా నిలిచిన ఆదర్శ నాయకుడైన సుదర్శన్ రెడ్డి, 1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి గ్రామంలో జన్మించారు. ఆయన 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్ఎస్) తరఫున జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ) సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన 2004లో టీఆర్ఎస్ జిల్లా పార్టీ కన్వీనర్‌గా ఎన్నికై, ఆ తర్వాత 2002లో రాష్ట్ర పార్టీ కన్వీనర్‌గా నామినేట్ అయ్యారు. ఆయన ఎనిమిదేళ్లకు పైగా టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి, ఆ తర్వాత పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నామినేట్ అయ్యారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరైన నర్సంపేట ప్రజలు, ఆయన అభిమానులు https://t.co/saQ2omKZnQ pic.twitter.com/StCT6Xklda
— Telugu Scribe (@TeluguScribe) July 31, 2026