చెన్నై: ఐటీ కంపెనీలో పని చేస్తున్న వ్యక్తి తన కుమారుడితో కలిసి స్కూటీపై ఇంటికి చేరుకున్నాడు. కారు నుంచి దిగిన వ్యక్తి ఆ టెక్కీ ముఖంపై కారం పొడి చల్లాడు. అతడి మూడేళ్ల కొడుకును కిడ్నాప్ చేశాడు. (Child Kidnapped) సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గుడియాతం ప్రాంతానికి చెందిన వేణు ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం మూడేళ్ల కుమారుడ్ని స్కూల్ నుంచి స్కూటీపై ఇంటికి తీసుకువచ్చాడు.
కాగా, ఆ ఇంటికి సమీపంలో తెల్లని కారు ఆగి ఉన్నది. వేణు రావడం చూసి తలకు హెల్మెట్ ధరించిన వ్యక్తి ఆ కారు నుంచి కిందకు దిగాడు. స్కూటీ పార్క్ చేస్తున్న వేణు ముఖంపై కారం చల్లాడు. అతడి మూడేళ్ల కుమారుడ్ని కిడ్నాప్ చేశాడు. వెంటపడిన వేణు తన కుమారుడ్ని కాపాడుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.
మరోవైపు బాలుడి కిడ్నాప్ సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆ చిన్నారిని కాపాడి తండ్రి వేణుకు అప్పగించారు. అయితే నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. బాలుడ్ని అతడు ఎందుకు కిడ్నాప్ చేశాడు అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. నిందితుడు వినియోగించిన కారుకు ఉన్న కర్ణాటక నంబర్ ప్లేట్ నకిలీదని పోలీస్ అధికారి వెల్లడించారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
வேலூர்: குடியாத்தத்தில், தந்தை மீது மிளகாய் பொடியை தூவி, 4 வயது ஆண் குழந்தையை காரில் கடத்திச் சென்ற கும்பல்.
மாதனூர் நெடுஞ்சாலையில் குழந்தையை அக்கும்பல் விட்டுச் சென்ற நிலையில், தகவலறிந்த தனிப்படையினர், 2 மணி நேரத்தில் குழந்தையை பத்திரமாக மீட்டனர்.#ChildKidnap | #vellore |… pic.twitter.com/xpmV9O3lB9
— PttvOnlinenews (@PttvNewsX) September 24, 2025
Also Read:
Top Cop’s Phones Snatched | ఐజీ చేతి నుంచి.. మొబైల్ ఫోన్లు లాక్కెళ్లిన దొంగలు
Watch: బీచ్‌లో చిక్కుకున్న స్కార్పియో.. తర్వాత ఏం జరిగిందంటే?