లక్నో: ఇంట్లో గొడవ నేపథ్యంలో భర్తను భార్య కొట్టింది. అంతేగాక అతడి చెవి కొరికింది. (Wife Bites Off Husband’s Ear) దీంతో గాయం కావడంతో చెవికి కట్టుకట్టించుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. భార్య తన చెవి కొరికిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. అమిత్ సోంకర్, సారిక దంపతులకు ఎనిమిదేళ్ల కిందట ప్రేమ వివాహం జరిగింది. అయితే ప్రస్తుతం విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
కాగా, సెప్టెంబర్ 22న రాత్రి వేళ ఇంట్లోని సోఫాపై అమిత్ నిద్రించాడు. ఇంటిని శుభ్రం చేస్తున్న భార్య సారిక భర్తపై మండిపడింది. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. భార్య సారికను అమిత్ తోశాడు. ఆగ్రహించిన ఆమె భర్తను కొట్టింది. ఆ తర్వాత సోఫాపైకి ఎక్కి అమిత్ కుడి చెవి కొరికింది.
మరోవైపు చెవి నుంచి రక్తం కారడంతో అమిత్ వెంటనే ఆసుపత్రికి వెళ్లాడు. గాయానికి కట్టుకట్టించుకున్నాడు. ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. భార్య సారిక తన చెవి కొరికిందని, కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించాడు. ఆమెతో కలిసి ఉండలేనని పోలీసులకు చెప్పాడు.
కాగా, సారిక కూడా భర్త అమిత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కొట్టాడని, హింసిస్తున్నాడని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఇరువురి ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. వారి విడాకుల కేసు విచారణ కోర్టులో పెండింగ్‌లో ఉన్నదని వెల్లడించారు.
Also Read:
Arvind Kejriwal | కేజ్రీవాల్‌కు పది రోజుల్లో ప్రభుత్వ నివాసం.. కోర్టుకు తెలిపిన కేంద్రం
Top Cop’s Phones Snatched | ఐజీ చేతి నుంచి.. మొబైల్ ఫోన్లు లాక్కెళ్లిన దొంగలు
Watch: టెక్కీ ముఖంపై కారం పొడి చల్లి.. అతడి మూడేళ్ల కుమారుడు కిడ్నాప్