ఫ్రాంచైజీల్లో తొలి పార్ట్‌కు 11వందలకోట్ల పైచిలుకు వసూళ్లు రావడం కేవలం ‘కల్కి 2898ఏడీ’ సినిమా విషయంలోనే జరిగింది. ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్‌కు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో నిశ్శబ్దంగా జరుగుతున్నది. అశ్వథ్థామ, కలిపురుషుడు యాస్కిన్ పాత్రలపై కీలక యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు నాగ్అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. అశ్వథ్థామగా అమితాబ్, యాస్కిన్‌గా కమల్‌హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడా బాడీ డబుల్స్‌ని ఉపయోగించకుండా వారు ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో నటిస్తున్నట్టు చిత్రబృందం చెబుతోంది.
ఇదిలావుంటే.. కమల్‌హాసన్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన నటుడు యోగిసేతు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘కల్కి 2’లో కమల్ పాత్ర, పారితోషికం తదితర అంశాల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘ ‘కల్కి 2898ఏడీ’లో కమల్‌హాసన్ పాత్ర నిడివి చాలా తక్కువ. కానీ ‘కల్కి 2’లో మాత్రం అందరికంటే ఆయన పాత్రే ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాకు 20 రోజుల కాల్షీట్స్‌కి గాను ఆయన 150కోట్లు పారితోషికంగా తీసుకున్నారు. దీంతో భారతదేశంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా కమల్‌హాసన్ అవతరించారు. రీసెంట్గా నిర్మాత సి.అశ్వనీదత్‌ని కమల్ సార్ నాకు పరిచయం చేశారు. నేను ఆయనకు ఈ విషయంపై కృతజ్ఞతలు తెలిపాను’ అని యోగిసేతు అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.