గంగాధర, జూలై 28 : కన్నెపల్లి పంపులను ఆన్‌చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్‌మానేర్, వరదకాలువకు నీటిని విడుదల చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. వరదకాలువకు నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని కోరుతూ కరీంగనర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో కరీంనగర్-జగిత్యాల రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో జీవనదిలా ఉన్న వరద కాలువ నేడు ఎడారిగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. కన్నెపల్లి పంపులను ఆన్‌చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో చేస్తున్న సుంకెతోపాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి గంగాధర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.