మాస్కో: కార్లు నిలిపిన పార్కింగ్ ప్రాంతం వద్దకు పెద్ద ఎలుగుబంటి వచ్చింది. అక్కడున్న జనంపై అది దాడి చేసింది. (Massive Bear Attacks) గాయపడిన ఒక వృద్ధురాలు మరణించింది. ఈ నేపథ్యంలో ఆ ఎలుగుబంటిని కాల్చి చంపారు. రష్యాలోని పెట్రోపావ్లోవ్స్కీ-కామ్చాటీస్కీలో ఈ సంఘటన జరిగింది. వరుసగా కార్లు పార్క్ చేసిన ప్రాంతంలో అకస్మాత్తుగా పెద్ద ఎలుగుబంటి కనిపించింది. అక్కడున్న వ్యక్తులపై అది దాడి చేసింది.
కాగా, ఎలుగుబంటి దాడి నుంచి 12 ఏళ్ల బాలుడు తృటిలో తప్పించుకున్నాడు. వెంటనే కారులోకి ఎక్కి డోర్ మూసేశాడు. మరో వ్యక్తి కారులో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఎలుగుబంటి దాడిలో గాయపడిన 84 ఏళ్ల వృద్ధురాలు మరణించింది.
మరోవైపు పోలీసులు, అధికారులు అలెర్ట్ అయ్యారు. ఒక స్కూల్ వద్ద ఆ ఎలుగుబంటిని కాల్చి చంపారు. అయితే ఆ ఎలుగుబంటి సృష్టించిన భయాందోళన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A dangerous bear went on a rampage in Russia’s Petropavlovsk-Kamchatsky. It attacked a 12-year-old boy (who survived by playing dead), a man in a parking lot (who escaped into his car), and an 84-year-old woman, who died from her injuries. The bear was shot near a local school. pic.twitter.com/Jbh4ZIZrWG
— Brian McDonald (@27khv) September 25, 2025
Also Read:
Man Shoots Girlfriend, Shoots Himself | ప్రియురాలిని కాల్చి చంపి.. తనను తాను కాల్చుకున్న ప్రియుడు
Wife Bites Off Husband’s Ear | భర్తను కొట్టి చెవి కొరికిన భార్య.. పోలీసులకు ఫిర్యాదు
Watch: టెక్కీ ముఖంపై కారం పొడి చల్లి.. అతడి మూడేళ్ల కుమారుడు కిడ్నాప్