లక్నో: కుటుంబ సభ్యులు, పోలీసులకు దొరికిపోతామన్న భయంతో ప్రియుడు తన ప్రియురాలిని గన్‌తో కాల్చి చంపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని చనిపోయాడు. దీంతో వీరి ప్రేమ కథ విషాదంతో ముగిసింది. (Man Shoots Girlfriend, Shoots Himself) ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో భగవాన్‌పూర్‌కు చెందిన ప్రిన్స్ అలియాస్ బిన్నీకి, ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లా తేజల్హేరా గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికతో పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ ప్రేమించుకున్నారు.
కాగా, సెప్టెంబర్ 20న బులంద్‌షహర్‌లోని దిబాయిలోని అద్దె ఇంటికి ఆ బాలికను ప్రిన్స్ తీసుకెళ్లాడు. గత నాలుగు రోజులుగా ఆమెతో కలిసి ఉన్నాడు. బాలిక కనిపించకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెను ప్రిన్స్ కిడ్నాప్ చేసినట్లు ఆరోపించాడు.
మరోవైపు దిబాయిలోని ఒక ఇంట్లో ఈ జంట ఉన్నట్లు ఇరు కుటుంబాలకు తెలిసింది. దీంతో సెప్టెంబర్ 24న పోలీసులతో కలిసి వారు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో తామిద్దరం దొరికిపోతామని ప్రిన్స్ భయాందోళన చెందాడు. తన వద్ద ఉన్న గన్‌తో ప్రియురాలిని కాల్చి చంపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని చనిపోయాడు.
కాగా, గన్‌తో పాటు ఆ జంట మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Wife Bites Off Husband’s Ear | భర్తను కొట్టి చెవి కొరికిన భార్య.. పోలీసులకు ఫిర్యాదు
Watch: టెక్కీ ముఖంపై కారం పొడి చల్లి.. అతడి మూడేళ్ల కుమారుడు కిడ్నాప్