అహ్మదాబాద్: ఫార్మ్‌హౌస్‌కు వెళ్లిన పోలీస్ అధికారిని అక్కడున్న పెంపుడు కుక్క గోళ్లతో రక్కింది. అయితే ఆయన పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆయనకు రేబిస్ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. చికిత్స పొందుతూ ఆ పోలీస్ అధికారి మరణించారు. (cop dies of rabies) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. పోలీస్ ఇన్స్పెక్టర్ వనరాజ్ మంజరియా అహ్మదాబాద్ సిటీ పోలీస్ కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల కిందట ఫార్మ్‌హౌస్‌కు ఆయన వెళ్లారు. అక్కడ మరొకరికి చెందిన పెంపుడు కుక్క ఆ పోలీస్ అధికారి కాలి వేళ్లను గోళ్లతో రక్కింది. దీనిని ఆయన పట్టించుకోలేదు.
కాగా, సెప్టెంబర్ 15న పోలీస్ అధికారి వనరాజ్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన పాదాల వేళ్లపై కుక్క రక్కిన ఆనవాళ్లను డాక్టర్లు గమనించారు. ఆయనకు రేబిస్ సోకినట్లు నిర్ధారించారు. అనంతరం ఆయన ఆరోగ్యం మరింత క్షిణించింది.
మరోవైపు సెప్టెంబర్ 19న ఆ పోలీస్ అధికారికి హైడ్రోఫోబియా వచ్చింది. చికిత్స పొందుతున్న ఆయన సెప్టెంబర్ 22న మరణించినట్లు బంధువులు తెలిపారు. జంతు ప్రేమికుడైన వనరాజ్, మరణించిన పెంపుడు జంతువులకు అంత్యక్రియలు నిర్వహించడంతోపాటు వాటి బూడిదను కూడా భద్రపరిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Also Read:
Jail For Cops | యువకుడి కస్టడీ డెత్‌పై కోర్టు సంచలన తీర్పు.. నలుగురు పోలీసులకు 11 ఏళ్లు జైలు శిక్ష
Boy Hides To Skip Tuition | ట్యూషన్‌కు వెళ్లకుండా దాక్కున్న బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
Girls Locked In Toilet Of Madrassa | మదర్సా టాయిలెట్లో.. 40 మంది బాలికల నిర్బంధం