లక్నో: ఒక వ్యక్తి బాలికను కిడ్నాప్ చేశాడు. ఒకచోట నిర్బంధించి ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. (Girl Kidnapped, Raped) చివరకు బాలికను నిర్బంధించిన ప్రాంతాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెను రక్షించడంతోపాటు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మోధ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక మార్చి 22న అదృశ్యమైంది. ఆమె తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు రోజులపాటు అన్ని చోట్ల వెతికారు.
కాగా, 21 ఏళ్ల ఆశిష్ కుమార్ సరోజ్ ఆ యువతిని మభ్యపెట్టి లోబర్చుకుని కిడ్నాప్ చేసినట్లు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. ఆరు నెలల తర్వాత సెప్టెంబర్ 26న ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని సంగం రైల్వే స్టేషన్ సమీపంలో ఆ బాలికను రక్షించారు. ఆశిష్ కుమార్ తనను నిర్బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించింది. దీంతో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం పంపినట్లు పోలీస్ అధికారి తెలిపారు. శనివారం కోర్టులో ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేసినట్లు చెప్పారు. నిందితుడు ఆశిష్ కుమార్‌పై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. రిమాండ్ కోసం అతడ్ని జైలుకు తరలించినట్లు వెల్లడించారు.
Also Read:
Case On Congress Leader’s Son | ఇద్దరు వ్యక్తులపై దాడి.. కాంగ్రెస్ నేత కుమారుడిపై కేసు
Baby Mother Detained | శిశువు నోటిలో రాయి ఉంచి పెదాలు అంటించి.. అడవిలో వదిలేసిన తల్లి అరెస్ట్
Fake Leopard Photo | చిరుత సంచరిస్తున్నట్లు నకిలీ ఫొటోలు వైరల్.. విద్యార్థి అరెస్ట్