జైపూర్: శిశువు ఏడవ కుండా నోటిలో రాయి ఉంచి గమ్‌తో పెదాలు అంటించి అటవీ ప్రాంతంలో వదిలేసిన కన్న తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. (Baby Mother Detained) ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం వల్ల ఆ బాబు ఆమెకు పుట్టినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో రెండు రోజుల కిందట 19 రోజుల పసికందును అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఆ శిశువు ఏడుపు ఎవరికీ వినిపించకుండా ఉండేందుకు నోటిలో రాయి ఉంచి పెదాలను గమ్‌తో అంటించి మూసేశారు. అయితే చిన్న మూలుగులు విన్న మేకల కాపరి ఆ శిశువును గుర్తించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ పసిబాబును స్వాధీనం చేసుకున్నారు. హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, నిఘా సమాచారం ద్వారా ఆ శిశువును కన్న మహిళను, ఆమె తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం వల్ల ఆమె గర్భం దాల్చిందని పోలీస్ అధికారి తెలిపారు. సమాజానికి భయపడి నకిలీ గుర్తింపు కార్డులతో బుండిలో ఒక గదిని ఆమె తండ్రి అద్దెకు తీసుకున్నాడని చెప్పారు.
మరోవైపు ఆ మహిళ మగబిడ్డను ప్రసవించగా తొలుత విక్రయించేందుకు వారు ప్రయత్నించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అది ఫలించకపోవడంతో అటవీ ప్రాంతంలో వదిలేశారని చెప్పారు. ఆ మహిళతో బిడ్డకు ఉన్న సంబంధాన్ని నిర్ధారించేందుకు డీఎన్ఏ పరీక్ష చేయిస్తామని అన్నారు.
కాగా, భిల్వారా మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శిశువు కోలుకుంటున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు. డాక్టర్లు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని వివరించారు.
Also Read:
Passenger Complaints | రెండేళ్లలో రైల్వేకు.. 61 లక్షలకు పైగా ప్రయాణికుల ఫిర్యాదులు
Village Headman Kills Man | కొడుకు నామకరణానికి ఆహ్వానించలేదని.. వ్యక్తిని కాల్చి చంపిన గ్రామపెద్ద
Father Kills Daughter | డబ్బులు దొంగిలిస్తున్నదని.. కుమార్తెను హత్య చేసిన తండ్రి