లక్నో: ఇంట్లోని డబ్బులు దొంగిలిస్తుండటంతో ఒక వ్యక్తి తన కుమార్తెను హత్య చేశాడు. (Father Kills Daughter) ఆ తర్వాత స్కూల్‌కు ఫోన్ చేసి తన కూతురు బంధువుల ఇంటికి వెళ్లిందని మూడు రోజులు రాదని చెప్పాడు. బాలిక మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు చివరకు ఆమె తండ్రిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బిచౌలా గ్రామానికి చెందిన 13 ఏళ్ల సోనమ్ ఏడో తరగతి చదువుతున్నది. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో అనుప్షహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వంతెన కింద పొదల్లో స్కూల్ యూనిఫాంలో ఉన్న ఒక బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్కూల్ డ్రెస్ ఆధారంగా మృతురాలిని సోనమ్‌గా గుర్తించారు. ఆమె చదువుతున్న స్కూల్లో ఆరా తీశారు. గురువారం స్కూల్‌కు వెళ్లిన ఆ విద్యార్థిని తండ్రి అజయ్ శర్మ బైక్‌పై తీసుకెళ్లినట్లు తెలుసుకున్నారు.
మరోవైపు 40 ఏళ్ల అజయ్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తన కుమార్తె కొన్ని రోజులుగా ఇంటి నుంచి డబ్బులు దొంగిలిస్తున్నదని అతడు ఆరోపించాడు. దీని వల్ల కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని తెలిపాడు. ఈ నేపథ్యంలో కుమార్తెను స్కూల్ నుంచి పొలానికి తీసుకెళ్లి గొంతునొక్కి హత్య చేసినట్లు చెప్పాడు.
ఆ తర్వాత స్కూల్‌కు అజయ్ శర్మ ఫోన్ చేశాడు. తన కుమార్తె బంధువుల ఇంటికి వెళ్లిందని, మూడు లేదా నాలుగు రోజుల పాటు స్కూలుకు రాదని చెప్పాడు. సోనమ్ మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. దీంతో పొలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ పడి ఉన్న సోనమ్ స్కూల్ బ్యాగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అజయ్ శర్మను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Boy Hides To Skip Tuition | ట్యూషన్‌కు వెళ్లకుండా దాక్కున్న బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
juvenile stabs boy to death | బెయిల్‌పై బయటకు వచ్చిన బాల నేరస్తుడు.. కత్తితో పొడిచి బాలుడ్ని హత్య