లక్నో: కుమారుడి నామకరణ కార్యక్రమానికి ఆహ్వానించని వ్యక్తిపై గ్రామ పెద్ద ఆగ్రహించాడు. ఆ వేడుక జరిగే చోటుకు అతడు వెళ్లాడు. గన్‌తో కాల్పులు జరిపి ఆ వ్యక్తిని హత్య చేశాడు. (Village Headman Kills Man) ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆ గ్రామ పెద్దను చావకొట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మోహన్పూర్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల అవనీష్ కుమార్‌కు ఇటీవల కొడుకు పుట్టాడు. గురువారం రాత్రి కుమారుడి నామకరణం కార్యక్రమం నిర్వహించాడు. ఈ సందర్భంగా గ్రామంలోని వారికి విందు ఇచ్చాడు.
కాగా, ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై గ్రామపెద్ద అయిన 48 ఏళ్ల సుఖ్‌దేవ్ ఆగ్రహించాడు. ఆ కార్యక్రమం జరిగే ప్రాంతానికి అతడు వెళ్లాడు. కుమారుడి నామకరణ కార్యక్రమానికి తనను ఆహ్వానించని అవనీష్ కుమార్‌పై గన్‌తో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. బుల్లెట్ గాయాలైన అతడ్ని ఆసుపత్రికి తరలించగా మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు అవనీష్పై కాల్పులు జరిపిన గ్రామపెద్ద సుఖ్‌దేవ్‌ను కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పట్టుకుని దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడటంతో హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే సుఖ్‌దేవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు. అవనీష్‌ను అతడు హత్య చేసిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Bodoland People’s Front | టెరిటోరియల్ కౌన్సిల్ ఎన్నికల్లో.. బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ క్లీన్ స్వీప్
Father Kills Daughter | డబ్బులు దొంగిలిస్తున్నదని.. కుమార్తెను హత్య చేసిన తండ్రి
Watch: మహిళను గాల్లోకి విసిరిన ఎద్దు.. వీడియో వైరల్