లక్నో: లేడీ టీచర్‌పై యాసిడ్ దాడికి పాల్పడిన వ్యక్తి పోలీసుల ఎన్కౌంటర్లో గాయపడ్డాడు. (Acid Attack on Teacher) అతడితోపాటు ఈ నేరానికి ఉసిగొల్పిన మహిళను కూడా అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 23న నఖాసా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్న 22 ఏళ్ల యువతి పాఠశాల తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్నది. స్కూటర్‌పై వచ్చిన వ్యక్తి ఆ ఉపాధ్యాయురాలి ముఖంపై యాసిడ్ పోశాడు. ఆమెకు 30 శాతం మేర యాసిడ్ వల్ల కాలిన గాయాలయ్యాయి. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు. అమ్రోహా జిల్లాలోని తిగ్రి గ్రామానికి చెందిన 30 ఏళ్ల నిషు తివారీని నిందితుడిగా గుర్తించారు. గురువారం రాత్రి పోలీసులు అతడ్ని గుర్తించి అడ్డుకోగా కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు తిరిగి కాల్పులు జరుపడంతో నిషు గాయపడ్డాడు. ఎన్కౌంటర్లో రెండు కాళ్లకు బుల్లెట్ గాయాలైన నిందితుడికి చికిత్స అందించిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు నిషును పోలీసులు ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. సోషల్ మీడియాలో పరిచయమైన డాక్టర్ అర్చన అనే మహిళతో తనకు సంబంధం ఉందని తెలిపాడు. సోదరి జాహ్నవికి ఒక సైనికుడితో పెళ్లి సంబంధం కుదిరిందని నిషుకు ఆమె తెలిపింది. అయితే ఆ జవాన్‌కు ప్రియురాలు ఉండటంతో ఆ పెళ్లి రద్దైనట్లు చెప్పింది.
కాగా, జవాన్ ప్రియురాలైన ఆ టీచర్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు నిషూను ఆ మహిళ ఉసిగొల్పింది. గతంలో కెమిస్ట్‌గా పని చేసిన అతడు యాసిడ్ కొని టీచర్‌పై దాడి చేశాడని పోలీస్ అధికారి తెలిపారు. జాహ్నవి, అర్చన ఒకే మహిళ అని దర్యాప్తులో తెలిసిందన్నారు.
మరోవైపు పెళ్లై ముగ్గురు పిల్లలున్న ఆ మహిళ గతంలో తన భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి నిషూతో పారిపోయిందని పోలీస్ అధికారి తెలిపారు. తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖంపై ఉన్న పుట్టుమచ్చను కూడా తొలగించిందన్నారు. నిషూతో పాటు జాహ్నవిని కూడా అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Fake Leopard Photo | చిరుత సంచరిస్తున్నట్లు నకిలీ ఫొటోలు వైరల్.. విద్యార్థి అరెస్ట్
Baby Mother Detained | శిశువు నోటిలో రాయి ఉంచి పెదాలు అంటించి.. అడవిలో వదిలేసిన తల్లి అరెస్ట్
Village Headman Kills Man | కొడుకు నామకరణానికి ఆహ్వానించలేదని.. వ్యక్తిని కాల్చి చంపిన గ్రామపెద్ద
Father Kills Daughter | డబ్బులు దొంగిలిస్తున్నదని.. కుమార్తెను హత్య చేసిన తండ్రి