లక్నో: చిరుత సంచరిస్తున్నట్లుగా నకిలీ ఫొటోలను ఒక విద్యార్థి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. (Fake Leopard Photo) ఇవి వైరల్ కావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే చిరుత ఫొటోలు నకిలీ అని దర్యాప్తులో తెలిసింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. ఆషియానా ప్రాంతంలోని రుచి, రజనీ ఖండ్ కాలనీల్లో రాత్రి వేళ చిరుత పులి సంచరిస్తున్నట్లుగా ఉన్న ఫొటోలు బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆ ప్రాంత వాసులు భయాందోళన చెందారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
కాగా, అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. ఆ చిరుత కోసం ఆ ప్రాంతంలో వెతికారు. అక్కడి ప్రజలను ఆరా తీశారు. అయితే చిరుత సంచారం లేదని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో వైరల్ అయిన ఫొటోలను అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. ఏఐ ద్వారా నకిలీ ఫొటోలు సృష్టించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుసుకున్నారు.
మరోవైపు బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ (బీజేఎంసీ) చదువుతున్న 22 ఏళ్ల విద్యార్థి ఈ నకిలీ ఫొటోలను ఆన్లైన్లో షేర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ యువకుడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. చిరుత నకిలీ ఫొటోలను షేర్ చేసిన అతడి ఫ్రెండ్ను కూడా విచారిస్తామని పోలీస్ అధికారి తెలిపారు.
Meet the BJMC student who digitally altered pictures to create leopard sighting scare in Lucknow. Says he had edited pictures and shared on WhatsApp group for fun. https://t.co/LONsNRfyF4 pic.twitter.com/fbmZbXSxcP
— Piyush Rai (@Benarasiyaa) September 26, 2025
Also Read:
Baby Mother Detained | శిశువు నోటిలో రాయి ఉంచి పెదాలు అంటించి.. అడవిలో వదిలేసిన తల్లి అరెస్ట్
Village Headman Kills Man | కొడుకు నామకరణానికి ఆహ్వానించలేదని.. వ్యక్తిని కాల్చి చంపిన గ్రామపెద్ద
Father Kills Daughter | డబ్బులు దొంగిలిస్తున్నదని.. కుమార్తెను హత్య చేసిన తండ్రి