భోపాల్: కాంగ్రెస్ నేత కుమారుడు ఇద్దరు వ్యక్తులపై దాడి చేయడంతోపాటు వారిని బెదిరించాడు. నగరంలోని సగం మంది తన పేరు వింటే భయపడతారని వారితో అన్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాధిత వ్యక్తుల ఫిర్యాదుతో కాంగ్రెస్ నేత కుమారుడిపై కేసు నమోదైంది. (Case On Congress Leader’s Son) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 3న అనికేత్ బైరాగి తన బావమరిది నీరజ్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ ఎన్పీ ప్రజాపతి కుమారుడు నీర్ ప్రజాపతి ఇంటికి వెళ్లి కలిశాడు. ఆయన మేనల్లుడు అమిత్ ప్రజాపతి, నీరజ్ మధ్య జరిగిన వివాదాన్ని ప్రస్తావించాడు.
కాగా, వివాదాన్ని పరిష్కరించడానికి బదులు అనికేత్, నీరజ్‌ను నీర్ ప్రజాపతి దుర్భాషలాడాడు. వారిద్దరిని కొట్టాడు. ‘భోపాల్‌లో సగం మంది తన పేరుకు భయపడతారు’ అని బెదిరించాడు. కాంగ్రెస్ నేత ఎన్పీ ప్రజాపతి కూడా కుమారుడి దాడిలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించాడు.
మరోవైపు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సెప్టెంబర్ 10న సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో అనికేత్, నీరజ్ కలిసి కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. కాంగ్రెస్ నేత ఎన్పీ ప్రజాపతి కుమారుడు నీర్ ప్రజాపతి తమను దుర్భాషలాడటంతో పాటు కొట్టి బెదిరించినట్లు ఫిర్యాదు చేశారు. దీంతో నీర్ ప్రజాపతితో పాటు అతడి బంధువులైన అమిత్ ప్రజాపతి, వినోద్ ప్రజాపతిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. కాంగ్రెస్ నేత ఎన్పీ ప్రజాపతితోపాటు ఆ పార్టీకి ఈ సంఘటన తలవంపుగా పరిణమించింది.
MP विधानसभा के पूर्व अध्यक्ष एन.पी. प्रजापति के बेटे ने की गुंडागर्दी,दो युवकों के साथ मारपीट और गाली गलौज का वीडियो हुआ वायरल#madhyapradesh #mpnews #narsinghpur #incmp #congress #bjp4mp #mppolitics #npprajapati #mppolitics #websuchna #viralvideo #viralreels pic.twitter.com/9z7rZDSFn6
— websuchna (@websuchna) September 26, 2025
Also Read:
Boy Hides To Skip Tuition | ట్యూషన్‌కు వెళ్లకుండా దాక్కున్న బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: మహిళను గాల్లోకి విసిరిన ఎద్దు.. వీడియో వైరల్