Namasthe Telangana | బాధితుల పక్షాన నమస్తే తెలంగాణ.. భూదాన్ భూముల్లో ఇండ్లు కూల్చిన నాటి నుంచి వరుస కథనాలు
Namasthe Telangana | ఖమ్మంలోని భూదాన్ భూముల బాధితులకు వెన్నుదన్నుగా నిలిచింది ‘నమస్తే తెలంగాణ’. వెలుగుమట్లలో పేదల గుడిసెలు కూల్చిన నాటి నుంచి వారి సమస్యను సమాజం దృష్టికి తీసుకొనిరావడంలో కీలకపాత్ర పోషించింది.
Namasthe Telangana | ఖమ్మం సిటీ, మార్చి 11: ఖమ్మంలోని భూదాన్ భూముల బాధితులకు వెన్నుదన్నుగా నిలిచింది ‘నమస్తే తెలంగాణ’. వెలుగుమట్లలో పేదల గుడిసెలు కూల్చిన నాటి నుంచి వారి సమస్యను సమాజం దృష్టికి తీసుకొనిరావడంలో కీలకపాత్ర పోషించింది. బాధితులు అనుభవిస్తున్న వెతలు, ఆర్తనాదాలను వెలుగులోకి తెచ్చి, వారికి కొండంత అండగా నిలిచింది. వెలుగుమట్ల వ్యవహారం రెండు మూడు రోజుల్లో సర్దుకుంటుందిలే అని భావించిన కాంగ్రెస్ పాలకులకు బీఆర్ఎస్ పార్టీ కూడా కంటిమీద కునుకులేకుండా చేసింది. వెలుగుమట్ల బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడంతో నిరాశ్రయుల అరిగోస జాతీయస్థాయిలో చర్చకు దారితీసింది.
అదే సమయంలో ‘నమస్తే తెలంగాణ’ పత్రిక కూడా బాధితుల కష్టాలకు అక్షరరూపమిచ్చింది. భూదాన్ భూముల్లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ నేతల గారడీలు, అధికారుల అకృత్యాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొచ్చింది. కొన్ని మీడియా సంస్థలు సమస్యను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించగా, ‘నమస్తే తెలంగాణ’ మాత్రం బాధితుల పక్షాన నిలబడింది. ప్రభుత్వ పెద్దలు పత్రికపై అక్కసు వెళ్లగక్కినా, హెచ్చరికలు జారీచేసినా ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. దినదినగండంగా బతుకుతున్న బీదలకు వెన్నుదన్నుగా నిలిచింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇచ్చేంత వరకు అలుపెరుగని అక్షర పోరాటం చేసింది. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో దాదాపు 400 పైచిలుకు నిరుపేద కుటుంబాలకు ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారంటే అందులో ‘నమస్తే తెలంగాణ’ పాత్ర క్రియాశీలకమని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కాగా, భూదాన్ బాధితుల్లో ఎవరిని పలుకరించినా.. ‘నమస్తే తెలంగాణ’ సాగించిన అక్షర పోరాటంతోపాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కృషి గురించే చెప్తున్నారు. కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు ఖమ్మం నగరానికి రాకపోయి ఉంటే తమ బతుకులు మరింత ఆగమయ్యేవని అంటున్నారు.
‘పువ్వాడ ఫౌండేషన్’ బాధ్యులతోపాటు మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు లేకపోతే తాము పస్తులతోనే కన్నుమూసే వారమని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వారికి జన్మజన్మలా రుణపడి ఉంటామని చేతులెత్తి నమస్కరిస్తున్నారు. తమపక్షాన నిలబడి పోరాడిన ‘నమస్తే తెలంగాణ’, ‘టీ న్యూస్’ సంస్థలకు రుణపడి ఉంటామంటూ ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు. తమ వేదన, రోదన, కన్నీటి గోసను బయటి ప్రపంచానికి తెలియజేయడంలో ఆ రెండు సంస్థలు చాలా గొప్పగా వ్యవహరించాయని కితాబిస్తుండటం విశేషం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

